చిరుకు చేతగాని పనులు చేయకని చెప్పా...మృగరాజు విషయంలో జరిగింది అదే...యండమూరి సంచలన వ్యాఖ్యలు

First Published Nov 19, 2020, 3:55 PM IST

 ఆధునిక తెలుగు నవలా రచయితల్లో యండమూరి వీరేంధ్రనాధ్ కి చాలా పేరుంది. సామాజిక స్పృహతో పాటు, ఎంటర్టైనింగ్ అంశాలు కలగలిపి ఆయన రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. 50కి పైగా నవలలు ఆయన రాయడం జరిగింది. 
 

నటుడిగా, మోటివేటర్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగాగా కూడా యండమూరి రాణించడం జరిగింది. పేరుకు నవలా రచయిత అయినా, తెలుగు చిత్ర పరిశ్రమతో యండమూరికివిడదీయరాని బంధం ఉంది. ఐతేరచయితగా ఎంత పేరుందో అదేస్థాయిలో ఆయనపైఆరోపణలు, వివాదాలుఉన్నాయి.
undefined
కొన్నేళ్ల క్రితం యండమూరిని ప్రేమించినఓ లేడీ ఫ్యాన్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ అమ్మాయి చావుకు యండమూరినే కారణమని అప్పట్లో వార్తలు రావడం జరిగింది. అలాగే ఆయన రాసిన కొన్ని నవలలుఇంగ్లీష్ నవలలకు కాపీ అనే అపవాదు కూడా ఉంది.
undefined
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిన యండమూరికి చిరంజీవి మధ్య మనస్పర్థలు వచ్చాయని కూడా కథనాలు రావడం జరిగింది. తాజాగా ఈ విషయంపైయండమూరి వివరణ ఇచ్చారు. మృగరాజు మూవీ సమయంలో చిరంజీవికి మీకు మధ్య గొడవ జరిగిందట కదా అని యాంకర్అడిగారు.
undefined
దానికి సమాధానంగా యండమూరి...మృగరాజు మూవీ విషయంలో మా మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. ఆ సినిమా సమయంలో నేను నా కొడుకు పెళ్లి హైదరాబాద్ లో చేయాలనుకున్నాను. ఆర్థిక సహాయం కోసం చిరంజీవిని కలవడం జరిగింది అన్నారు.
undefined
అప్పుడు చిరంజీవి మృగరాజు నిర్మాతగా ఉన్న నాగబాబును కలవమన్నారు. ఆ సినిమా స్టోరీ విషయంలో సలహాలు ఇచ్చినందుకు నాకు నాగబాబు రూ. 4 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బుతో కొడుకు పెళ్లి చేశాను అన్నారు.
undefined
ఐతే చిరంజీవి రాజకీయాలలోకి రావడం నాకు ఇష్టం లేదు. అది మీకు చేత కాని పని, మీ వ్యక్తిత్వానికి రాజకీయాలు సరిపడవు అని సలహా ఇచ్చాను. కాకపోతే రాజకీయ పార్టీ గురించి ఆయన ప్రసంగం వస్తున్న సమయంలో, మరో ఛానల్ లో నేను ఆయన రాజకీయంగా సక్సెస్ కారని చెప్పాను. అది ఆయనను నొప్పించింది. అంతకు మించి గొడవలు ఏమీ లేవని యండమూరి చెప్పుకొచ్చారు.
undefined
చిరంజీవి నటించిన మంచు పల్లకి, అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి అనేక చిత్రాలు యండమూరి వీరేంద్రనాధ్ నవలల ఆధారంగా తెరకెక్కడం జరిగింది.
undefined
click me!