బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌.. ఏకంగా బిగ్‌బీతోనే..!

Published : Nov 19, 2020, 12:48 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల బాలీవుడ్‌లో వార్తల్లో నిలిచి అందరికి షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా బాలీవుడ్‌ ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. తాజాగా రకుల్‌ మరో క్రేజీ ఆఫర్‌ని సొంతం చేసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.   

PREV
16
బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌.. ఏకంగా బిగ్‌బీతోనే..!

టాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్నా.. హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. 

26

ఇటీవల తెలుగులోనూ ఈ అమ్మడికి విజయాలు లేవు. దీంతో ఎక్కువగా బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్న రకుల్‌ తాజాగా మరో హిందీ ఆఫర్‌ని దక్కించుకుంది. 

36

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేసే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. ఫస్ట్ టైమ్‌లో అమితాబ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని చేజిక్కించుకుంది. 
 
46

అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంలో వహిస్తూ `మేడే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ మెయిన్‌ రోల్‌ పోషిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంతోపాటు ఫైలర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని ఎంపిక చేశారట. ఇందులో ఆమె కో పైలట్‌గా కనిపించనుందని టాక్. 

56

దీనిపై రకుల్ మాట్లాడుతూ, `అమితాబ్ బచ్చన్‌ సర్‌తో కలిసి ఏదో ఒక రోజు పనిచేయాలని అందరిలానే నేను కూడా ఎన్నో కలలు కన్నాను. `మేడే` చిత్రంతో ఆ కల నిజం కాబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ఈ సినిమాను వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నారని టాక్‌. 

66

రకుల్‌ ఇప్పటికే అజయ్‌తో `దే దే ప్యార్‌ దే` చిత్రంలో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో `చెక్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు కమల్‌ హాసన్‌ `భారతీయుడు 2`లో నటిస్తుంది. హిందీలో అర్జున్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తుండగా, మరో సినిమాకి సైన్‌ చేసింది. ఇప్పుడు `మేడే`లో మెరవబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories