ఆ సమయంలోనే పెళ్లి కూడా చేసుకున్నాడట. ఓ వైపు తన ఫ్యామిలీని మెయింటేన్ చేస్తూ నెల నెల తనకు కూడా డబ్బులు పంపించేవాడని తెలిపారు. చాలా కాలం పాటు తనకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాడని తెలిపారు రైటర్. తాను ఇక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తున్నానని, ఆఫర్లు రాకపోవడంతో తాను కూడా వచ్చేస్తానని చెబితే, `ఒరేయ్ బాబు ఆ పనిచేయవాకు, అవసరమైతే ఇళ్లు అమ్మేసి డబ్బులు ఇస్తాను, నువ్వు మాత్రం ఆ పనిచేయకు, ఎన్నిరోజులైనా కొట్టే(ఆఫర్లు) రావాలి అని సపోర్ట్ చేసేవాడట.