90 దశకంలో వరుస సినిమాలతో వెండితెరను వరుసగా ఏలింది మీనా. తమిళం, తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. తెలుగులో చంటి, అబ్బాయిగారు, సూర్యవంశం, గిల్లి కజ్జాలు, స్నేహం కోసం, ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆమె సినిమాలు బోలెడు. ఇప్పటికీ దృశ్యం సినిమాలతో హీరోయిన్ గానే అలరిస్తోంది బ్యూటీ.