హీరోయిన్స్ పట్ల ఇప్పటికీ సమాజంలో చులకన భావన ఉంటుంది. కెరీర్ కోసం దిగజారుతారనే అపవాదులు ఉంది. అందుకే, నేను హీరోయిన్ అవుతానని ఒక అమ్మాయంటే కనీస ప్రోత్సాహం ఉండదు. పురుషాధిక్య సమాజంలో హీరో కొడుకు హీరో అవుతానంటే భేష్ అని వెన్ను తడతారు. అదే కూతురు హీరోయిన్ అవుతానంటే కుదరదంటారు. అదేదో పెద్ద నేరంగా, కాని పనిగా చూస్తారు. ముఖ్యంగా ఒక స్టార్ హీరో కూతురు నటి కావడాన్ని డై హార్డ్ ఫ్యాన్స్ హర్షించరు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు భయపడి కొందరు స్టార్ కిడ్స్ ఆ ఆలోచన మానుకున్నారు. కొద్దిమంది హీరోల కూతుళ్లు మాత్రం సమాజాన్ని ఎదిరించి హీరోయిన్స్ అయ్యారు. ఆ రెబల్ స్టార్ కిడ్స్ ఎవరో చూద్దాం....
211
International Womens day Special
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. వన్ అండ్ ఓన్లీ మెగా హీరోయిన్ గా రికార్డులకు ఎక్కింది నిహారిక కొణిదెల. నటుడు నాగబాబు కూతురు హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు.
311
International Womens day Special
హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. పెద్దమ్మాయి శివాని, చిన్న కూతురు శివాత్మిక సినిమాల్లో రాణిస్తున్నారు. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
411
International Womens day Special
విశ్వ నాయకుడు కమల్ హాసన్ సైతం తన ఇద్దరు కూతుళ్లను పరిశ్రమకు తీసుకొచ్చారు. శృతి హాసన్, అక్షర హాసన్ హీరోయిన్స్ అయ్యారు. అయితే అక్షర హాసన్ అక్క మాదిరి సక్సెస్ కాలేదు.
511
International Womens day Special
హీరో అర్జున్ సర్జా కూతుళ్ళలో ఒకరైన ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ అయ్యారు. రెండు తమిళ, ఒక కన్నడ చిత్రం చేశారు. తండ్రి అర్జున్ దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా చేస్తున్నారు.
611
International Womens day Special
హీరో మహేష్ బాబు అక్క మంజుల హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పట్లో ఆమె ఎంట్రీ దుమారం రేపింది. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో మంజుల ఆశ చంపుకున్నారు. 'షో' టైటిల్ తో తెరకెక్కిన ప్రయోగాత్మకంగా చిత్రంలో మంజుల హీరోయిన్ గా నటించారు.
711
International Womens day Special
హీరో కమల్ హాసన్ అన్నగారైన నటుడు చారుహాసన్ కూతురు సుహాసిని స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయారు. ఆమె దర్శకుడు మణిరత్నం ని వివాహం చేసుకున్నారు.
811
International Womens day Special
నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి హీరోయిన్ అయ్యారు. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో మూవీ చేస్తున్నారు.
911
International Womens day Special
హీరో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ 'ది అర్కీస్' టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్నారు. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ సైతం హీరోయిన్ గా చిత్రాలు చేస్తున్నారు.
1011
International Womens day Special
దబంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హా నటుడు శత్రుజ్ఞ సిన్హా కూతురు. ఇక సాహో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రద్దా కపూర్ నటుడు శక్తి కపూర్ కుమార్తె. సోనాక్షి, శ్రద్దా బాలీవుడ్ లో రాణిస్తున్నారు.
1111
International Womens day Special
కోలీవుడ్ లో రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత నటుడు రాజేష్ కుమార్తెనే ఐశ్వర్య రాజేష్. లేడీ కమెడియన్ లక్ష్మి ఆమెకు మేనత్త అవుతారు.