`మా` రాజకీయాల్లో `మెగా` ట్విస్ట్.. చిరంజీవిని ఇరకాటంలోకి నెట్టనున్న మహిళా కార్డ్ ?

First Published | Jun 26, 2021, 10:51 PM IST

`మా` ఎన్నికల రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అధ్యక్షుడు నరేష్‌ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త పరిణామాలకు దారి తీస్తుంది. తెరపైకి వచ్చిన మహిళా కార్డ్ ఇప్పుడు `మా`లో హీటును పెంచుతుంది. చిరంజీవి అప్పుడు చెప్పిందే ఇప్పుడు తెరపైకి వస్తుంది. 

`మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌`(మా) రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. వరుసగా ప్రెస్‌మీట్లతో హీటు పెంచుతున్నారు. మరోవైపు రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. తాజాగా శనివారం `మా` ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ ప్రెస్‌మీట్‌ `మా`లో కొత్త పరిణామాలకు తెరలేపుతుంది. మహిళా కార్ట్ ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు.
`మా` అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ్‌ పోటీ పడుతున్నారు. తాము `మా` అధ్యక్ష పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ ఓ అడుగు ముందుకేసి 27 మందితో తమ ప్యానెల్‌ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మీడియా ముందుకొచ్చి తాను చేయాల్సిన విషయాలను,పలు సందేహాలను తెలిపారు.

అదే సమయంలో ప్రస్తుతం `మా` ప్రతిష్ట మసకబారిందని, దాన్ని గాడిలోకి తీసుకొస్తామన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకొస్తున్నామని, మా బిల్డింగ్‌, సంక్షేమం వంటి విషయాలను ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు ప్రస్తావించారు. సేవ చేయాలని వస్తున్నట్టు తెలిపారు ప్రకాష్‌ రాజ్‌. దీనికి కౌంటర్‌ ఇచ్చాడు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్. తాము చేసిన పనులను మీడియా ముఖంగా వెల్లడించారు. ప్రకాష్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆయన మంచి ఫ్రెండ్‌ అని తెలిపారు. ఈ సందర్భంగా నరేష్‌ మహిళా సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు మహిళా అధ్యక్షులుగా లేరని, ఈ సారి మహిళని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్‌ టైమ్‌లో ఫస్ట్ టైమ్‌ `మా` అధ్యక్ష పీఠం కోసం జయసుధ పోటీ పడ్డారు. కానీ ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గతేడాది `మా`లో కార్యదర్శిగా జీవితా రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. ఆమె `మా`లో చురుకుగా ఉన్నారు. ఇప్పుడు నరేష్‌ కూడా పరోక్షంగా జీవితాకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ రోజు ప్రెస్‌మీట్‌లో నరేష్‌తోపాటు జీవిత కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ తను అధ్యక్ష బరిలో నిలవడంతో ప్రెస్‌మీట్‌కి హాజరు కాలేదని తెలిపారు.
ఈ క్రమంలో నరేష్‌తో ఆమె మహిళా కార్డ్ ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా చిరంజీవి వ్యాఖ్యలను కూడా వారు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌. రెండేళ్ల క్రితం `మా` డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అందులో చిరంజీవి, మోహన్‌బాబు, కృష్ణంరాజు, నరేష్‌, జీవిత, రాజశేఖర్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆ సందర్భంగా జీవితని ఉద్దేశించి నెక్ట్స్ మహిళని అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చిరంజీవి తెలిపారు.
దీన్నే ఇప్పుడు జీవిత ఆయుధంగా మలుచుకోబోతుందని తెలుస్తుంది. అదే సమయంలో చిరంజీవిని ఇరకాటంలో పెట్టబోతుంది. అందులో భాగంగా నరేష్‌తో ఆ వ్యాఖ్యాలు చేయించిందనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి అప్పుడు చేసిన వ్యాఖ్యలతో ప్రకాష్‌రాజ్‌కి మద్దతు ఇవ్వబోతున్నాడనేది విషయంలో చిరుని `మహిళా కార్డ్`ని ఇరకాటంలోకి నెట్టబోయేలా ఉంది. ఈ నేపథ్యంలో మహిళా కార్డ్ ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు నరేష్‌, జీవిత.
ఇదిలా ఉంటే ఈ పోటీలో నుంచి మంచు విష్ణు డ్రాప్‌ అవుతాడా? కొనసాగుతాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. అలాగే హేమ కూడా చివరి నిమిషంలో డ్రాప్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మంచు విష్ణు కూడా వెనక్కి తగ్గితే ప్రకాష్‌రాజ్‌, జీవితలు అధ్యక్ష బరిలో ఉంటారు. అప్పుడు మహిళా సెంటిమెంట్‌తో జీవితా ఈసారి పై చేయి సాధించినా ఆశ్చర్యం లేదంటున్నారు క్రిటిక్స్. అదే సమయంలో మంచుమోహన్‌బాబు కూడా జీవితకే సపోర్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ రకంగానూ చిరుకి ఇరకాటం తప్పేలా లేదు.
ఇదిలా ఉంటే ఈ సారి `మా` ఎన్నికలు పూర్తయిన తర్వాత పలు సందర్భాల్లో నరేష్‌, జీవితాలకు పడలేదు. నరేష్‌ ధోరణి విషయంలో వాళ్లు అసంతృప్తి చెందారు. మరోవైపు `మా` డైరీ ఆవిష్కరణలో కూడా రాజశేఖర్‌ బహిరంగంగానే విమర్శలు చేశారు. పనులు చేయనీవ్వడం లేదని, అడ్డుకుంటున్నారని పరోక్షంగా నరేష్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో ఇది పెద్ద దుమారమే రేగింది. `మా` నుంచి ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.
మరి అప్పుడు గొడవ పడ్డ నరేష్‌, జీవితాలు ఇప్పుడెలా కలిసిపోయారు? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రకాష్‌కి రాజ్‌కి చిరంజీవి ఆశిస్సులు ఉన్నాయని, మెగా మద్దతు ఉందని నాగబాబు ప్రకటించారు. మరి ఇప్పుడు మహిళా కార్డ్ విషయంలో జీవితా చిరు మద్దతుని ఎలా కోరుతుంది? నిజంగానే ప్రకాష్‌ రాజ్‌కి చిరు ఆశిస్సులున్నాయా? మరి తానే స్వయంగా చెప్పిన `మహిళా అధ్యక్షులు` అనే వ్యాఖ్యల పరిస్థితేంటి? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

jeevitha

దీంతో ఇప్పుడు `మా` ఎన్నికలు మరింత హీటెక్కుతున్నాయి. రానురాను మరింత హీటెక్కే అవకాశాలున్నాయి. అదే సమయంలో అనేక సమీకరణాలు, లెక్కలు మారే అవకాశం ఉంది. మంచు విష్ణు అధ్యక్ష బరిలో ఉంటాడా? తప్పుకుంటాడా? ఉంటే మహిళా కార్డ్ ఏం కాబోతుంది. మూడుముక్కలాటలో హేమ నలిగిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతుందనేది మున్ముందు తేలనుంది. `మా` ఎన్నికలకు ఇంకా రెండు నెలలున్నాయి. సెప్టెంబర్‌లో నిర్వహించే ఛాన్స్ ఉంది.

jeevitha

Latest Videos

click me!