జబర్ధస్త్ సక్సెస్ చూసిన అనేక ఛానల్స్ దానికి పోటీగా అదే తరహాలో అనేక ప్రోగ్రామ్స్ రూపొందించారు. అయితే ఏ ఒక్క షో కూడా జబర్ధస్త్ మాదిరి ఆదరణ దక్కించుకోలేదు. జబర్ధస్త్ నుండి బయటికి వెళ్ళిపోయిన నాగబాబు, తనతో పాటు కొందరు కమెడియన్స్ ని తీసుకొని వెళ్లి అదిరింది షో చేశారు. అది కూడా సక్సెస్ కాలేదు.
తాజాగా జబర్ధస్త్ ని ఢీ కొట్టడానికి స్టార్ మా కామెడీ స్టార్స్ పేరుతో ఓ షో రూపొందించింది. జనవరి 31 ఆదివారం నుండి స్టార్ మా లో ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కానుంది.
ఢీ నుండి బయటికి వచ్చిన వర్షిణిని ఈ షోకి యాంకర్ గా తీసుకున్నారు. ప్రారంభ ఎపిసోడ్ లో వర్షిణి హాట్ హాట్ స్టెప్స్ తో ఐటెం బేబీగా స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
ఇక కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించడం విశేషం. క్రాక్ మూవీలోని ఐటెం సాంగ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె అదరగొట్టారు.
ఇక ఈ షోలో టీమ్ లీడర్స్ గా ముక్కు అవినాష్ ఒకరు ఉన్నారు. ముక్కు అవినాష్ తనదైన కామెడీతో షోలో రచ్చ చేశారు.
మరో టీమ్ లీడర్ గా చమ్మక్ చంద్ర మొదటి స్కిట్ లో డాక్టర్ గా అదరగొట్టాడు. ఇద్దరు నర్సు లతో శంకర్ దాదా ఎం బి బి ఎస్ రేంజ్ లో కామెడీ అల్లాడించారు.
టీం లీడర్స్ కామెడీకి యాంకర్ వర్షిణీ పడిపడి నవ్వారు. అవినాష్, చమ్మక్ చంద్ర కామెడీ ఆమె ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు కనిపించారు.
ఢీ లేటెస్ట్ సీజన్ నుండి వర్షిణీని తొలగించారు. ఆ షో కోల్పోయినా ఆమె కామెడీ స్టార్స్ రూపంలో మరో షో పొందడం జరిగింది.
చమ్మక్ చంద్ర, అవినాష్ లాంటి కమెడియన్స్ అందమైన శ్రీదేవి లాంటి జడ్జ్, వర్షిణి లాంటి హాట్ యాంకర్ తో కామెడీ స్టార్స్ అంచనాలు పెంచేసుకుంది.
జబర్ధస్త్ కి పోటీగా మొదలైన కామెడీ స్టార్స్ తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తుంది.
మరి అదే జరిగితే రోజా, అనసూయ, రష్మీ లకు షాక్ తగిలినట్టే. సోలో గా వర్షిణి సక్సెస్ కొట్టినట్లు అవుతుంది.
జనాల్లో పాతుకు పోయిన జబర్ధస్త్ ని దాటివేసి టాప్ పొజిషన్ కి చేరడం అంత ఈజీ కాదు. ఇప్పటికే నాగబాబు అదిరింది షో ద్వారా అది రుజువైంది.
అయితే లాంగ్ టర్మ్ లో షోలో మంచి కామెడీ పండితే జబర్ధస్త్ ని బీట్ చేయడం అంత కష్టం కూడా కాదు.