Liger: `లైగర్‌` సినిమా ఎందుకు చూడాలంటే.. ఐదు అసలైన కారణాలివే?

First Published Aug 24, 2022, 9:16 PM IST

విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌` కి సంబంధించిన చర్చే ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. సినిమాపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలనే దానికి ఐదు కారణాలు చెబుతున్నారు విజయ్‌ అభిమానులు. 
 

undefined

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండకి వరుస ఫ్లాపుల అనంతరం చేసిన `లైగర్‌`కి ఈ స్థాయి క్రేజ్‌ రావడం ఊహించనిది. ఆయన ఇండియా వైడ్‌గా ప్రమోషన్‌ చేయడం మరో విశేషం. అత్యంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సినిమా ఇది. అయితే ఎందుకింత క్రేజ్‌, ఎందుకింత హైప్‌ అనేదానికి కొన్ని  కారణాలున్నాయి. అవే ఇప్పుడు సినీ లవర్స్ ని, విజయ్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై భారీ హైప్‌ని పెంచుతున్నాయి. 
 

ప్రధానంగా `లైగర్‌ చూడ్డానికి ఐదు కారణాలుగా విశ్లేషిస్తే.. `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం` తో స్టార్‌ అయిపోయాడు విజయ్‌. చిరంజీవి, అల్లు అర్జున్‌, మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్లు కూడా విజయ్‌ని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయిన ఆయన ఇప్పుడు డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీతో చేసిన పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. దీనికితోపాడు పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాని ప్రమోట్‌ చేశారు. విజయ్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రానికే ఈ స్థాయి క్రేజ్‌, హైప్‌ ఏర్పడటం విశేషం. 

రెండో కారణం పూరీ జగన్నాథ్‌.. వరుస పరాజయాల అనంతరం `ఇస్మార్ట్ శంకర్‌`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు  పూరీ. ఆ ఫ్లోలో రాసుకున్న కథ ఇది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కించారు. పైగా కరణ్‌ జోహార్‌ వంటి భారీ నిర్మాత ఇందులో భాగం కావడంతో నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకి ఊహించని విధంగా క్రేజ్‌ ఏర్పడింది. పూరీ సత్తాకిది నిదర్శనంగా నిలవబోతుంది. 
 

మూడు రమ్యకృష్ణ.. `బాహుబలి` తర్వాత రమ్యకృష్ణకి ఆ స్థాయిలో విజయం దక్కలేదు. ఆ స్థాయి సినిమా రాలేదు. ఇప్పుడు ఇందులో విజయ్‌కి అమ్మగా నటించింది. ఆమె పాత్ర చాలా డేరింగ్‌గా, కాస్త బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మామూలుగా బలమైన పాత్రలు దక్కితే రమ్యకృష్ణ విశ్వరూపం చూపిస్తుంది. ఇందులో ఆమె పాత్ర అలానే ఉండబోతుందట. మదర్‌ సెంటిమెంట్‌ ఈ సినిమాకి మరో అసెట్‌గా నిలవబోతుంది. 
 

Image: Mike Tyson, Vijay DeverakondaInstagram

ఇక వరల్డ్ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ ఫస్ట్ టైమ్‌ ఇండియన్‌ సినిమాలో నటించడం విశేషం. దీంతో సినిమా ఇండియా వైడగానే కాదు, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకి ఊహించని క్రేజ్‌ ఏర్పడింది. దానికితోడు యాక్షన్‌ ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన బలంగా నిలవబోతున్నాయి. ఇదీ సినిమాని చూసేందుకు ఓ కారణంగా ఉంది.

దీనికితోడు స్ఫూర్తినిచ్చే కథ కూడా సినిమాకి మరో మెయిన్‌ అసెట్‌. కరీంనగర్‌కి చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన ఓ పేద కుర్రాడు తన తల్లి కోరిక ఎలా నెరవేర్చాడు, ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతను,  అతని తల్లి పడే  సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. `ఇద్దరమ్మాయిలతో` సినిమా టైమ్‌లో బన్నీ చెప్పిన మాట కారణంతో ఈ స్క్రిప్ట్ ని పూరి రాసుకోవడం విశేషం.

మొత్తంగా ఈ ఐదు కారణాలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. పైగా ఈ సినిమాకి ఐదో షోకి కూడా  అనుమతి దక్కడం విశేషం. ఇక విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ భామ అనన్య పాండే జంటగా పూరీ రూపొందించిన `లైగర్‌` చిత్రాన్ని ఛార్మి,  కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఈ సినిమాని ఐదు భాషల్లో భారీ స్థాయిలో రేపు(ఆగస్ట్ 25న) విడుదల కాబోతుంది. 
 

click me!