కళ్యాణి, సూర్య కిరణ్ విడాకులకి అసలు కారణం, ఆ పొరపాటే ముంచేసిందా?

Published : Mar 11, 2024, 03:25 PM ISTUpdated : Mar 11, 2024, 03:57 PM IST

కెరీర్ మంచి స్టేజ్‌లో ఉండగానే.. సుమంత్‌తో ‘సత్యం’ (Satyam) వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సూర్య కిరణ్‌ను వివాహం చేసుకుంది. 

PREV
113
కళ్యాణి, సూర్య కిరణ్  విడాకులకి  అసలు కారణం, ఆ పొరపాటే ముంచేసిందా?

దర్శకుడిగా ‘సత్యం’ సినిమాతో మంచి పేరు గడించిన సూర్య కిరణ్..   ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్  కళ్యాణిని విడాకులు చేసుకున్నారు. అయితే ఆమెతో ఎక్కువ కాలం జీవితం గడపలేకపోయారు. ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఆమె తో విడిపోవడానికి గల కారణాలను ఎప్పటికప్పుడు ఇంటర్వూలలో  పంచుకుంటూ వచ్చారు. సూర్య కిరణ్ హఠాత్ మరణంతో విస్తుపోయిన సిని పరిశ్రమ ఆయన గురించిన విషయాలు ఇప్పుడు మరోసారి డిస్కస్ చేస్తోంది. 

 

213

వాస్తవానికి పెళ్లైన కొత్తల్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఇద్దరూ ఉండేవారు. కళ్యాణి (Kalyani), సూర్య కిరణ్ (Surya Kiran) ఇద్దరూ అన్యోన్య దంపతులుగా పేరు పొందారు. ఇండస్ట్రీలో జరిగిన చాలా  ఈవెంట్స్‌కు సైతం ఇద్దరూ కలిసి హాజరై.. ఎప్పుడూ నిండుగా కనిపించేవారు. కానీ హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏం జరిగిందో.. విడాకులు తీసేసుకోబోతున్నారనే వార్త బయిటకు వచ్చింది.  దీంతో అసలు వారిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనే చర్చ మొదలైంది. ఇద్దరూ మొదట్లో ఏమీ మాట్లాడలేదు.
 

313

ఓ సారి ఇంటర్వూలో భాగంగా  తన మాజీ భార్య కళ్యాణిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని కానీ కళ్యాణికి తనతో జీవించడం ఇష్టం లేదని దాంతో ఆమె ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే వారి విడాకులకు కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కారణమని తెలియవచ్చింది. దానికి తోడు పిల్లలు లేకపోవటం కూడా వీరిద్దరి అనుబంధాన్ని తెంపేసింది.మానసికంగా దూరమై తర్వాత విడాకులు తీసుకున్నారు.

413

సుమంత్ తో చేసిన సత్యం  తర్వాత చేసిన చిత్రాలతో సరైన గుర్తింపును పొందలేకపోయారు సూర్య కిరణ్. ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లేకపోవడంతో అది ఆయన కెరీర్‌పై పడింది. ఈ క్రమంలో  ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కళ్యాణి తన వరకు వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటించినా.. కుటుంబాన్ని నిలబెట్టేంతగా ఆమె సంపాదన లేకపోయింది. దీంతో విడాకులే శరణ్యం అనుకున్న ఇద్దరూ విడిపోయారు. 

513
Surya Kiran

వీరి విడాకులకు గల కారణాన్ని సూర్యకిరణ్ సోదరి  సుజిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నయ్యకు పెళ్లయిన మూడేళ్లకే నాకు వివాహం జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్‌లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు అన్నయ్యతో ఫోన్‌ మాట్లాడేదాన్ని. హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. వదిన (కల్యాణి) అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటి. తనతో మాట్లాడటం, తనతో ఉండటం నాకు చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు ఎలా ఉండేవారో మేమిద్దరం అలా ఉండేవాళ్లం.

613

అయితే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువకాలం ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని బ్యాలెన్స్‌ చేసే సామర్థ్యం దంపతుల్లో ఒక్కరికైనా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాళ్లిద్దరూ అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య నిర్మాతగా సినిమా తీశాడు. నాకు చెప్తే సరేనన్నాను. అదే ఆయన్ను దెబ్బ కొట్టింది. ఫైనాన్సియల్ గా కోలుకోకుండా చేసేసింది.

713

చివరకు వారు తీసిన సినిమా డిజాస్టర్‌ అయింది, నష్టాలు వచ్చాయి. అదే వారి జీవితంలో వచ్చిన పెద్ద సమస్య! మాకీ విషయం తెలిసి సాయం చేద్దామనుకునేలోపు వారు మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు.  అన్నయ్యకు, నాకు 8 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌. ఆయనకు సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తనే నాకు తండ్రి లాగా! తనంటే నాకు కొంత భయం కూడా! అని చెప్పుకొచ్చారామె.

813

ఇక  కేరళలో మాకు మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్‌. ఇది అందరికీ కలిసి రాదు.. ఉన్న డబ్బంతా సినిమా కోసం పెట్టడం అనేది తెలివితక్కువ తనం. ఈ ఒక్క పని వాళ్ల జీవితాన్ని ముంచేసింది' అని చెప్పుకొచ్చింది సుజిత.

913

 ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన సూర్య కిరణ్‌.. కల్యాణితో విడాకులపై స్పందిచాడు. వారి విడాకులకు కారణాలపై నోరు విప్పాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేం 15 ఏళ్లు కాపురం చేశాం. మా మధ్య ఎన్నడు అభిప్రాయ భేదాలు కానీ, గొడవలు కానీ రాలేదు. ఎంతో అనోన్యంగానే ఉన్నాం. నేను చూసిన మంచి అమ్మాయిల్లో కల్యాణి ఒకరు. ఆవిడ చాలా మంచివారు. అయితే సొంత ప్రొడక్షన్‌ పెట్టి సినిమాలు తీయడం వల్ల ఆస్తుల పోయాయి. అప్పుల పాలయ్యాను, ఒకవేళ దానికి బయపడే ఆమె విడాకులు అడిగిరామో’ అని చెప్పుకొచ్చాడు.  

1013

అలాగే  ‘‘మేం విడిపోవడానికి కారణమేంటని కోర్టు అడిగిన ప్రశ్నకు కూడా కల్యాణి ఏం సమాధానం చెప్పలేదు. విడాకుల కోసం మేం జడ్జిని సపరేట్‌ చాంబర్‌లో కలిశాం. అప్పుడు జడ్జి నన్ను చూపిస్తు ‘ఈయన కొడతారా? తిడతారా? మీ అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారా?’ అని కల్యాణిని అడిగారు. దానికి కల్యాణి లేదని సమాధానం ఇచ్చింది. మరెందుకు విడాకులు తీసుకుంటున్నారని అడిగినా తను ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది. ఆ వెంటనే జడ్జి మీరు డైవర్స్‌ తీసుకుంటే పిల్లల బాధ్యత ఎవరిది?’ అని ప్రశ్నించారు. వెంటనే నేను మాకు పిల్లలు లేరన్నాను.

1113

మీకు పిల్లలు లేకపోవడటమే విడాకులకు కారణమా? అని అడగంతో అవును అని చెప్పాను. ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ‘వేయిట్‌ చేయండి. అప్పులు తీరిపోయిన తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను’’ అన్నాడు. చివరగా తనకున్న అప్పుల కారణంగా అందరు తనని డబ్బులు అడిగి ఇబ్బంది పెడతారనే ఆందోళనతోనే కల్యాణి విడాకులు తీసుకుని ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

1213

 కాగా సూర్య కిరణ్‌ తమిళంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. బాల నటుడిగా ఆయన దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు.   సుమంత్ సత్యం మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఈ క్రమంలో జౌను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు మూవీతో పరిచయమైన వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2020లో  విడాకులు తీసుకుని విడిపోయారు. 

1313

కళ్యాణి తన భర్త సూర్య కిరణ్ తో విడిపోయినప్పటినుంచి చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అంతేగాక కళ్యాణి దర్శకురాలిగా మారి ఓ చిన్న తరహా బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఆ మధ్య కాలంలో పలు వార్తలు బలంగా వినిపించాయి. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘వసంతం’ వంటి చిత్రాలలో నటించి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నటిగా కళ్యాణి మంచి పేరును సొంతం చేసుకుంది. 

click me!

Recommended Stories