సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. నటనలోకి రాకముందు సింగర్‌గా పాపులర్, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు పాడింది. జీవీ ప్రకాష్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, హారిస్ జయరాజ్ లాంటి వాళ్ళ సంగీత దర్శకత్వంలో హిట్ సాంగ్స్ పాడింది బ్యూటీ. తను యాక్ట్ చేసిన సినిమాల కంటే పాడిన పాటలే ఎక్కువ. అంతే కాదు పాడిన ప్రతీ పాట హిట్ అయ్యింది. అందంతో మాయ చేసి.. పాటలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?
ఆమె మరెవరలో కాదు ఆండ్రియా జెర్మియా. తను సింగర్‌గా మొదలుపెట్టిన సినిమా అపరిచితుడు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ‘నీకునాకు నోకియా సాంగ్ ను ’ ఆండ్రియానే పాడింది. తర్వాత హారిస్ జయరాజ్ మ్యూజిక్‌లో వేట్టైయాడు విలయాడు సినిమాలో ‘కార్కా కార్కా’, ఆధవన్ సినిమా కోసం ‘యేనో యేనో’, తుపాకి సినిమా కోసం విజయ్‌తో కలిసి ‘గూగుల్ గూగుల్’ సాంగ్ ఇలా హారిస్ మ్యూజిక్‌లో తను పాడిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి.
Also Read:
ఇలా యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్, అనిరుధ్ రవిచందర్, జీవీ ప్రకాశ్ కుమార్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజింగ్ లో హిట్ సాంగ్స్ పాడింది. ఆండ్రియా. అటు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో మన్మధన్ అంబు సినిమాలో ‘Who's The Hero' సాంగ్ కూడా ఆండ్రియానే పాడింది. తర్వాత సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌లో సూదు కవ్వుమ్ సినిమా కోసం ‘మామా టౌజర్ అవుందుచు’ సాంగ్ ఆండ్రియానే గాత్రం నుంచి వచ్చిందే. ఇక సినిమాల విషయంలో సూపర్ హిట్ మూవీస్ చేసింది బ్యూటీ.
Also Read:
తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటించింది ఈ బ్యూటీ. తెలుగులో రీసెంట్ గా వచ్చిన సైంధవ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ. అంతకు ముందు కూడా తఢాకా సినిమాలో నటించి మెప్పించింది. ఇక డబ్బింగ్ సినిమాలుగా వచ్చినా టాలీవుడ్ లో కూడా ప్రభావం చూపించిన కార్తీ యుగానికి ఒక్కడు, శకుని సినిమాలతో పాటు.. విశాల్ పూజ. విశ్వరూపం రెండు సినిమాలతో పాటు మరికొన్ని హిట్ సినిమాల్లో సందడి చేసింది ఆడ్రియా.