Giri Babu: ఎన్టీఆర్ కు కోపం తెప్పించిన గిరిబాబు.. కృష్ణ సినిమా వల్ల ఏం జరిగింది? తప్పుడు ప్రచారం చేసింది ఎవరు?

Published : Nov 16, 2026, 10:16 AM IST

Giri Babu: 80 ఏళ్ళ వయసులో కన్నుమూశారు తెలుగు పరిశ్రమ సీనియర్ నటుడు గిరిబాబు. మూడు తరాల తారలతో కలిసి నటించిన ఆయన.. ఓ సందర్భంలో ఎన్టీఆర్ కు కోపం చెప్పించారట. దానికి కారణం ఏంటి? వీరి మధ్యలో కృష్ణ విషయం ఎందుకు వచ్చింది?

PREV
13
అజాత శత్రువు'గా పేరు

తెలుగు సినీ పరిశ్రమలో సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు గిరిబాబు, 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉంటూ పరిశ్రమలో 'అజాత శత్రువు'గా పేరు తెచ్చుకున్న ఆయన జీవితంలో ఒకసారి సీనియర్ ఎన్టీఆర్‌తో చిన్నపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సంఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏంటో గిరిబాబు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

23
గిరిబాబుపై సీనియర్ ఎన్టీఆర్ ఆగ్రహానికి కారణం ఏంటి?

ఆ రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ మధ్య కొన్ని సినిమాల విషయంలో అభిప్రాయ భేదాలు ఉండేవి. సరిగ్గా ఆ సమయంలోనే గిరిబాబు నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టారు. తన తొలి సినిమా 'దేవతలారా దీవించండి' విజయం తర్వాత, మరో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తాను సిద్ధం చేసుకున్న 'సింహగర్జన' కథకు కృష్ణను హీరోగా ఎంచుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ 'సింహబలుడు' అనే జానపద సినిమాను ప్రారంభించారు.

రెండు చిత్రాలు జానపద నేపథ్యంలో ఉండటంతో పాటు, రెండింటి పేర్లలోనూ 'సింహ' అనే పదం కలిసిరావడంతో కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ సినిమాకు పోటీగా, కృష్ణను హీరోగా పెట్టి గిరిబాబు సినిమా తీస్తున్నారని ఎన్టీఆర్ చెవిన వేశారు. దీంతో ఎన్టీఆర్ గిరిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

33
అపోహ ఎలా తొలగిపోయింది?

ఈ విషయం తెలిసిన వెంటనే గిరిబాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున ఆరు గంటలకే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ గిరిబాబును ప్రత్యేకంగా గదిలోకి పిలిపించారు. ఆ సమయంలో గిరిబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తనకు రెండు కళ్లతో సమానమని, వారిని ఆదర్శంగా తీసుకునే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు. పెద్దలంటే అపారమైన గౌరవం ఉన్న తనకు, ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా సినిమా తీయాలనే ఆలోచన ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు.

'సింహగర్జన' కథను కేవలం ఐదు నిమిషాల్లో ఎన్టీఆర్‌కు వివరించారు. కథ విన్న తర్వాత రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ స్వయంగా అన్నారు. అపోహ తొలగిపోవడంతో గిరిబాబును మెచ్చుకుని, సినిమా బాగా తీయాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత విడుదలైన 'సింహగర్జన' మంచి విజయం సాధించగా, 'సింహబలుడు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తన మాటతీరు, వినయంతో పెద్దల మనసు గెలుచుకున్న గిరిబాబు.. ఎన్టీఆర్ ఆగ్రహానికి గురవ్వడమే కాదు.. ఆ అపోహలను తొలగించడానికి స్వయంగా రంగంలోకి దిగారు కూడా. అలా ఇండస్ట్రీలో ప్రతీఒక్కరితో మంచిగా ఉంటు మంచి పేరు తెచ్చుకున్నారు గిరిబాబు.

Read more Photos on
click me!

Recommended Stories