మహేష్‌ బాబు పాన్‌ ఇండియా సినిమా చేయకపోవడానికి కారణమేంటో తెలుసా?.. కొడితే కుంభస్థలమే?

First Published | Jan 20, 2024, 5:41 PM IST

మహేష్‌ బాబు ఇప్పటి వరకు పాన్‌ ఇండియా సినిమా చేయలేదు. ఇటీవల వచ్చిన `గుంటూరు కారం` కూడా తెలుగులోనే చేశారు. మరి పాన్‌ ఇండియా వైపు అడుగులు వేయడానికి కారణమేంటి?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఇటీవల `గుంటూరు కారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందనతో రన్‌ అవుతుంది. అయితే చాలా చోట్ల ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కావాల్సి ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాటల మాంత్రికుడి డైరెక్షన్‌, రైటింగ్‌ పరంగా విమర్శలు వస్తున్నాయి. విపరీతమైన ట్రోల్స్,నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించాయి. నిర్మాత మాత్రం ఈమూవీ చాలా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని వెల్లడించారు. కానీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. 

ఇదిలా ఉంటే మహేష్‌ బాబు ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా సినిమాల చేయలేదు. యంగ్‌ హీరోలు సైతం పాన్‌ ఇండియా అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన తేజ సజ్జా సైతం పాన్‌ ఇండియా మూవీతో హిట్‌ కొట్టాడు. ఆయన నటించిన `హనుమాన్‌` మూవీ పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. నిర్మాతలకు భారీగా లాభాలు తీసుకురాబోతుంది. అయితే ఇలా చాలా మంది హీరోలు అప్పుడే పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తున్నారు. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, బన్నీ, నాని ఇలాంటి అంతా పాన్‌ ఇండియా వెంట పరిగెడుతున్నారు. 
 


కానీ ఇప్పటి వరకు మహేష్‌ బాబు ఒక్క పాన్‌ ఇండియా మూవీ చేయలేదు. ప్రస్తుతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో `గుంటూరు కారం` అయినా పాన్‌ ఇండియా ప్రయత్నం చేయలేదు. అయితే మహేష్‌ పాన్‌ ఇండియా సినిమాల విషయంలో చాలా ప్లానింగ్‌తో ఉన్నారట. ఈ మూవీని పాన్‌ ఇండియాకి చేయకపోవడానికి ఓ కారణం ఉందట. అది మహేష్‌ నిర్ణయమే అని తెలుస్తుంది. 
 

తాజాగా దీనిపై `గుంటూరు కారం` నిర్మాత నాగవంశీ మాట్లాడారు. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా చేయకపోవడాని కారణం చెప్పారు. మహేష్‌ బాబునే వద్దన్నారట. ఆయన ప్రాపర్‌గా పాన్‌ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. అది రాజమౌళి సినిమాతోనే చేయాలని అనుకుంటున్నారట. అందుకోసమే ముందుగా ఆయన పాన్‌ ఇండియా చిత్రాలు చేయలేదని తెలిపారు నాగవంశీ. నెక్ట్స్ రాజమౌళి సినిమా చేయాల్సి ఉన్న నేపథ్యంలో మహేష్‌ ఈ మూవీని తెలుగులోనే చేయాలని చెప్పినట్టు తెలిపారు. 

ఇక మహేష్‌ బాబు `గుంటూరు కారం`తో సంక్రాంతికి వచ్చాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోయింది. నైజాంలో చాలా నష్టాలను తెచ్చేలా ఉందని తెలుస్తుంది. ఆంధ్ర, సీడెడ్‌లో కాస్త బెటర్‌గా ఉందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇక నెక్ట్స్ మహేష్‌ బాబు.. రాజమౌళితో సినిమాలో చేయబోతున్నారు. ఈ సమ్మర్‌లోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందట. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్‌గా మూవీగా ఇది తెరకెక్కబోతుంది. 

Latest Videos

click me!