పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ గా ఉంది. జులై 28న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర టీమ్ ప్రచారంలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రం మిగతా పెద్ద హీరోల సినిమాలతో పోలిస్తే లిమిటెడ్ రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా, ఓవర్ సీస్ లోనూ అదే పరిస్దితి. ఎందుకనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.