శిల్పాశెట్టి దంపతుల ఆస్ది 98 కోట్లు సీజ్, కారణం ఆ ఛండాలపు పనులే,ఫోర్న్ కేసు కూడా...

First Published Apr 19, 2024, 9:47 AM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని...


బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) షాకిచ్చింది. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో వారి ఆస్తులను జప్తు చేసిన వార్త ఇప్పుడు సెన్షేషన్ గా మారింది. ఇందులో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ముంబై జుహు ప్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే భర్త రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఈ కేసులో రూ. 98 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకు ఈడీ ఇలా ఈ మొత్తం ఆస్దులను సీజ్ చేసింది..

 గతంలో రాజ్‌కుంద్రా బిట్‌కాయిన్‌ పేరుతో మోసాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ముంబయికి చెందిన 'వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే సంస్థ 2017లో 'గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌'ను నిర్వహించింది. ఇందులో భాగంగానే బిట్‌కాయిన్లపై పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయంటూ ప్రజలకు ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లోని పలువురి నుంచి దాదాపు రూ.6,600 కోట్లును ఆ సంస్థ వసూలు చేశారు. ఈ మోసం బయటపడటం వల్ల సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి తాజాగా దర్యాప్తు చేపట్టింది.

2017లో రాజ్‌కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్‌ కాయిన్‌ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ. 6600 కోట్ల అక్రమంగా సంపాదించాడు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు పది శాతం లాభాలు వస్తాయయని ప్రజలను నమ్మించారు. డబ్బులు చేతికి వచ్చాక ఇన్వెస్టర్లను మోసం చేశారు. 

ఈ మోసం బయటపడటంతో ఈడీ అధికారులు సదరు బిట్‌కాయిన్‌ సంస్థ, దాని ప్రమోటర్లపై కూడా కేసు నమోదు చేసింది. ఇలా బిట్‌ కాయిన్‌తో స్కామ్‌లకు పాల్పడుతూ ఎంతోమందిని మోసం చేసినట్టు ఆయనపై మహారాష్ట్ర, ఢిల్లీ ఇతరప్రాంతాలు రాజ్‌కుంద్రాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నమోదైన వివిధ కేసుల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 


ఈ క్రమంలో తాజాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిల ఆస్తులను కూడా బిట్‌ కాయిన్‌ స్కామ్‌కు అటాచ్‌ చేసి ఆస్తులు జప్తు చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
  ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు అతడి స్నేహితులు సింపీ భరద్వాజ్‌, నితిన్‌ గౌర్‌, నిఖిల్‌ మహాజన్‌ అరెస్ట్‌ అయ్యారు నిందితులుగా ఉండగా ఇప్పటికే వారు అరెస్ట్‌ అయ్యారు.  ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. 


బిట్‌ కాయిన్‌ స్కామ్‌ కేసులో ప్రధాన నిందితుడైన అజయ్‌ భరద్వాజ్‌, మహేంద్ర భరద్వాజ్‌లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ స్కామ్‌కు ప్లాన్‌ చేసిన మాస్టర్‌ మైండ్‌ అమిత్‌ భరద్వాజ్‌ 2022లో మరణించారు. అయితే ఆయన గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్‌కాయిన్లు ఇచ్చినట్టు విచారణలో తేలింది. వాటితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ ఏర్పాటు చేయాలని భావించాడట. కానీ, అది కుదరలేదు.


అయితే, ఇప్పటికీ ఆ బిట్‌ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ.150 కోట్లుగా ఉన్నట్టు విచారణలో రాజ్‌కుంద్ర పేర్కొన్నట్టు ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాగా గతంలో రాజ్ కుంద్రాపై పోర్న్ వీడియో కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో అతడు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లాడు. అప్పుట్లో ఈ వార్త ఇండస్ట్రీలో కలకలం రేపింది. 

violet ruffle saree

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నమోదైన బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ తోపాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేశారు.

Shilpa Shetty


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ఎంటరయ్యారు. కేసు దర్యాఫ్తులో భాగంగా.. రాజ్ కుంద్రా తన పేరుమీద ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు.
 

వాస్తవానికి రాజ్ కుంద్రా 2022లో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయ్యారు. దాదాపు 2 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన రాజ్, అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా బయట మాస్క్ పెట్టుకునే ఉంటున్నారు. గుమ్మం దాటి బ‌య‌ట‌కు వస్తే చాలు ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు.

మరోవైపు రాజ్‌ కుంద్రా జీవితం ఆధారంగా UT69 అనే మూవీ వస్తోంది. ఈ సినిమాను షానవాజ్ అలీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా SVS స్టూడియోస్ నిర్మిస్తోంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పడిన మానసిన సంఘర్షణలను ఇందులో చూపనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్‌లోనే రాజ్ కుంద్రా త‌న మాస్క్ తీసి క‌నిపించారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 తనను ముంబయి క్రైమ్ బ్రాంచ్​లోని కొందరు అధికారులు.. పోర్నోగ్రపీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ విచారించి.. తనకు న్యాయం జరిగేటట్లు చూడాలని కోరారు. కాగా కొన్నాళ్ల క్రితమే రాజ్​ కుంద్రా బెయిల్​పై విడుదలయ్యారు.  పోర్నోగ్రఫీ కేసు విషయంలో న్యాయం చేయాలని ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశా. అభ్యంతరకరంగా సినిమాలు తీసినవారితో నాకెలాంటి సంబంధం లేదు. పోర్నోగ్రఫీ కేసులో దాఖలైన ఒర్జినల్​ ఛార్జ్​షీట్​లో నా పేరు లేకపోయినా క్రైమ్​ బ్రాంచ్ పోలీసులు నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Shilpa Shetty

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు 2021  జులై 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు సాగిస్తున్న అధికారులు.. సాక్ష్యాలను సేకరించి కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు ఇంకా తేలాల్సి ఉంది. 

click me!