NTR: ఎస్వీ రంగారావు ‌- ఎన్టీఆర్ కు ఎందుకు పడదు? వారి మధ్య విభేదాపై కైకాల సత్యనారాయణ ఇచ్చిన క్లారిటీ ఏంటి?

Published : Nov 21, 2026, 03:54 PM IST

NTR: టాలీవుడ్ కీర్తి కిరీటంలా నిలిచిన నటులలో ఎస్వీఆర్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చాలా సినిమాల్లో అద్భుతమైన పాత్రలు కలిసి చేశారు. కలిసి సినిమాల చేసిన వీరి మధ్య గొడవలేంటి? ఈ విషయంలో నటుడు కైకాల సత్యనారాయణ ఏం కామెంట్స్ చేశారు?

PREV
14
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటులలో ఎన్టీఆర్ తో పాటు ఎస్వీఆర్ పేరు కూడా పక్కాగా ఉంటుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్ లాంటి తారలు కలిసి మెలిసి ఉండేవారు. మయాబజార్ లాంటి ప్రాజెక్ట్ లలో అందరు అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే అంత మంచి సినిమాలు చేసిన ఎన్టీఆర్, ఎస్వీఆర్ మధ్య గొడవలు ఉండేవా? ఇద్దరికి ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. ఇద్దరు మహానటుల మధ్య గొడవలకు కారణం ఏంటి? అలనాటి నటుడు దివంగత కైకాల సత్యనారాయణ ఈ వియంలో ఇచ్చిన క్లారిటీ ఏంటి?

24
మహానటుల మధ్య విభేదాలు ఎందుకు?

తెలుగు సినీ చరిత్రలో మహానటులుగా నిలిచిన ఎస్వీ రంగారావు, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మధ్య ఉన్న విభేదాలు, వారి స్వభావాల గురించి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ఎస్వీ రంగారావుకి, ఎన్టీఆర్ కి మధ్య విభేదాలకి ప్రధానంగా వారి పనిచేసే పద్ధతులు, పంతాలు ఒక కారణమని కైకాల సత్యనారాయణ వివరించారు. ఎన్టీఆర్ విషయంలో ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉండేవని, కాల్షీట్ల విషయంలో సంతకాలు చేయడం వంటి పద్ధతులు అమలయ్యేవని పేర్కొన్నారు. అయితే, రంగారావు కి అలాంటి కాగితాల మీద సంతకాలు చేసే అలవాటు ఉండేది కాదని, ఆయన స్వభావం భిన్నంగా ఉండేదని చెప్పారు.

34
రంగారావు స్వభావం ఏంటి?

ఎస్వీ రంగారావు గారు మిగతా విషయాలను పెద్దగా లెక్కచేసే మనిషి కాదని కైకాల తెలిపారు. ఆవేశం, పంతం, అలాగే అమాయకత్వం కలగలిసిన స్వభావం ఆయనదని కైకాల అన్నారు. ఏదైనా విషయంలో తప్పు అనిపిస్తే నేరుగా మాట్లాడే తీరు, తనకు నచ్చని పద్ధతులకు లొంగని తత్వం వల్ల ఎన్టీఆర్ తో ఎస్వీఆర్ కు అభిప్రాయ భేదాలు తలెత్తేవని వివరించారు.

44
ఇద్దరు ఇద్దరే..

సెట్‌లో వాతావరణం, మాటల తీరుషూటింగ్ సమయాల్లో, మాటల సందర్భంలో ఇద్దరి మధ్య కొంత సీరియస్ వాతావరణం ఉండేదట. అలాంటి సందర్భాలు చాలా ఉండేవని కైకాల సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. ఒకరి పద్ధతి మరొకరికి ఇబ్బంది కలిగించినప్పుడు, ఆవేశంతో మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాల వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగిందన్నారు. అయినప్పటికీ, ఇద్దరూ తమ రంగంలో అగ్ర నటులుగా ఎదిగి, తెలుగు సినిమాకు మరపురాని పాత్రలను అందించారని కైకాల తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories