Sudhakar: అందరి ముందు హీరో సుధాకర్‌ చెంపపగల గొట్టిన స్టార్‌ హీరోయిన్‌.. తప్పేంటంటే?

Published : Nov 21, 2026, 01:03 PM IST

కమెడియన్‌ సుధాకర్‌ని స్టార్‌ హీరోయిన్‌ చెంప దెబ్బ కొట్టింది. పాట చిత్రీకరణలో ఆయన చేసిన పొరపాటు కారణంగా ఆమె అందరి ముందు కొట్టాల్సి వచ్చిందట. మరి తప్పేం జరిగిందంటే?

PREV
13
హీరోగా కెరీర్‌ని స్టార్ట్ చేసిన కమేడియన్‌ సుధాకర్‌

కమేడియన్‌ సుధాకర్‌ కెరీర్‌ బిగినింగ్‌లో హీరోగా సినిమాలు చేశారు. తెలుగు, తమిళంలో ఆయన సినిమా చేసి మెప్పించారు. ఓ వైపు హీరోగా సినిమాలు, మరోవైపు కీలక పాత్రలు చేశారు. అట్నుంచి కమేడియన్‌గా టర్న్ తీసుకున్నారు. ఇక వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. స్టార్‌ కమేడియన్‌గా ఎదిగారు. కానీ ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం, వయసురీత్యా వచ్చిన ఇబ్బందుల కారణంగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓ స్టార్‌ హీరోయిన్‌ తన చెంప పగలగొట్టిన విషయాన్ని వెల్లడించారు.

23
సుధాకర్‌ చెంప పగలగొట్టిన హీరోయిన్‌ రాధిక

సుధాకర్‌ తమిళంలో 1978లో `కిజక్కే పొగుమ్‌ రైల్‌` అనే చిత్రంలో నటించారు. భాగ్యరాజా దర్శకుడు, సుధాకర్‌ హీరో. ఇందులో ఎంఆర్‌ రాధిక హీరోయిన్‌. సినిమా షూటింగ్‌ స్టూడియోలో జరుగుతుంది. అందులో ఒక పాట ఉంది. ఆ పాటలో రాధిక పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆమెని సుధాకర్‌ ఎత్తుకొని తిప్పాల్సి ఉంటుంది. అలా ఎత్తుకునే క్రమంలో అనుకోకుండా సుధాకర్‌ చేయి ఆమె లంగా లోకి వెళ్లిందట. వెంటనే ఆమె ఇబ్బందిగా ఫీలై సుధాకర్‌ చెంపమీద కొట్టిందట. దెబ్బకి సుధాకర్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఇదేంటి ఇలా జరిగిందని ఆయన షాక్‌ అయ్యారట. తన వైపు నుంచి జరిగిన తప్పుకు క్షమాపణలు కూడా చెప్పారట. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని, ఇంటిమసీ కోసం తామిద్దరం కలిసి తిరిగామని, తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పారు సుధాకర్‌. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు.

33
అసలేం జరిగిందంటే? తర్వాత క్లోజ్‌ ఫ్రెండ్‌

అయితే ఆ సమయంలో తాను అలా చేయడానికి మరో కారణం. హీరోగా తమిళంలో తొలి చిత్రమిది. రాధికా.. ప్రముఖ దిగ్గజ నటుడు, పొలిటీషియన్‌ ఎంఆర్‌ రాధా కూతురు. అప్పట్లో బాగా పాపులర్‌, అండ్‌ పవర్‌ఫుల్‌ పర్సన్‌. ఆయన కూతురు అనేసరికి సుధాకర్‌కి టెన్షన్‌ పట్టుకుందట. ఆ భయంతోనే ఆ సీన్‌ చేయాల్సి వచ్చిందని, ఆ కంగారులో పొరపాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు సుధాకర్‌. అనుకోకుండా జరిగిన పొరపాటు అని, తాను బాధపడ్డానని, తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయామని తెలిపారు. ఈ ఓల్డ్ ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు వైరల్ గా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories