త్వరలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో పాటు, కరోనా విషయంలో పాటించవలసిన భద్రతా నియమాలు విడుదల చేసింది. కాబట్టి పటిష్ట చర్యల మధ్య షూటింగ్స్ జరగనున్నాయి. ఇక టాలీవుడ్ కూడా దీనికి సిద్ధం అవుతుంది. రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ సెప్టెంబర్ 2నుండి షూటింగ్ మొదలుపెట్టనునట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ సీనియర్ స్టార్ హీరోలు వయసురీత్యా కొంచెం భయపడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతోఆచార్య మూవీ చేస్తున్నారు. చిరు బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన రాగా, మూవీపైఅంచనాలుపెరిగిపోయాయి. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి బన్నీ చిత్రాన్ని సిద్ధం కావాలనుకుంటున్నారు. మరి 65ఏళ్ల చిరు షూటింగ్ కి హాజరవుతారో లేదో చూడాలి.
నందమూరినట సింహం బాలయ్య దర్శకుడు బోయపాటితోమూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. బాలయ్య సైతం 60ప్లస్ లోకి వచ్చారు. మరి బాలయ్య షూటింగ్ కి వస్తాడాఅనే అనుమానం ఉంది.
ఇక విక్టరీవెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతోనారప్ప మూవీ చేస్తున్నారు. 50శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించాలిఅనుకుంటున్నారు. వెంకటేష్ వయసు 59ఏళ్ళు కాగా, ఆయన షూటింగ్ కి రావడానిధైర్యం చేస్తారా అనే సందేహం మొదలైంది.
ఇక మరో సీనియర్ హీరో నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. మరి నాగ్ ఏజ్ కూడా 60దాటిపోయింది. షూటింగ్ కి వేళాయెరా అంటే నాగ్ ఏమంటారో. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు ముందు బరిలో దిగుతారో చూడాలి.