విక్రమ్, దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ ల తెరకెక్కిన తాజా తమిళ్ చిత్రం ‘తంగలాన్’పై రిలీజ్ కు ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. విక్రమ్ కెరీర్ లో 61 చిత్రంగా వచ్చిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో మెల్లింగా టాక్ మొదలై పికప్ అవుతోంది. అలాగే తెలుగు స్ట్రైయిట్ సినిమాల కు పోటిగా ఆగస్ట్ 15వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే తంగలాన్ విడుదలైన తొలి రోజు నుంచే తమిళనాడులో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తోంది.