స్టార్ హీరోలకు సామాన్యులు అభిమానులుగా ఉంటారు. ప్రాణంగా ప్రేమిస్తుంటారు. మరి ఆ స్టార్ హీరోలకు కూడా అభిమాన నటులు ఉంటారు కదా..? వారికి వారే అభిమానులుగా ఉండలేరు కదా..? సో స్టార్ హీరో అయినా.. సామాన్యులైనా.. తాము అభిమానించే నటులు ఖచ్చితంగా ఉంటారు. అలా చాలా సందర్భాల్లో మన స్టార్ హీరోలు తమ అభిమాన నటులు ఎవరు అనేది వెల్లడిచిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. టాలీవుడ్ లో అతి పెద్ద సినిమా కుటుంబంగా రికార్డ్ క్రియేట్ చేసింది మెగా ఫ్యామిలీ. అయితే ఈ ఫ్యామిలీ మొత్తం మీద పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కోట్లలో అభిమానులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
Mega Family
మెగాస్టార్ చిరంజీవి …పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్, పంజా వైష్ణవ తేజ్, అల్లు శిరీష్ ఇలా ఇంత మంది హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీకి మాత్రం మరో హీరో ఫేవరేట్ అనీ మీకు తెలుసా..? మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో లేడీస్ కు టాలీవుడ లో ఓ హీరో ఫేవరెట్ అంట.
Nani
మెగా ఫ్యామిలీలో మహిళలు సైతం ఇష్టపడి మరి సినిమాలు చూసే ఆ టాలీవుడ్ హీరో ఎవరో ? కాదు. నేచురల్ స్టార్ నాని. ఈ విషయాన్ని రీసెంట్ గా గేమ్ ఛేంజర్ ప్రిరీలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాని గారి సినిమాలు చాలా బాగుంటాయి.. మా కుటుంబంలో వాళ్లకు మా అక్కలకు నాని గారు నటించిన సినిమాలు అంటే చాలా ఇష్టం.
వాళ్లు నాని గారి సినిమాలు క్రమం తప్పకుండా చూస్తారు …మాకు మరే హీరో మీద ఈర్ష – అసూయ ద్వేషాలు లాంటివి ఉండవు అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ ఆ మాట చెప్పగానే నాని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ నాని సినిమాలు తెగ చూసేస్తారు అని అంటున్నారు నెటిజన్లు.
Ram Charans Game Changer
ఇక మెగా ఫ్యామిలీ నుంచి పుష్ప సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. జనవరి 10 రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఎలాంటిరిజల్ట్ సాధిస్తుందో చూడాలి.