హన్సిక మోత్వానీ పై గృహ హింస కేసు.. ఎవరు పెట్టారంటే..?

First Published | Jan 8, 2025, 12:59 PM IST

హన్సిక మోత్వానీ,  ఆమె తల్లితో పాటు అన్నపై కూడా గృహహింస కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఆ కేసు పెట్టింది ఎవరో తెలుస్తే షాక్ అవుతారు.  ఈ విషయంలో ప్రస్తుతం  హన్సిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. 
 

హన్సిక మోత్వానీ

హీరోయిన్  హన్సిక మోత్వానీ, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఫిర్యాదును హన్సిక వదిన, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ చేశారు. హన్సిక, ఆమె తల్లి మోనా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఇద్దరిపైనా గృహ హింస కేసు నమోదు చేశారు. 

ఈ విషయంలో హన్సిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, హన్సిక నేరుగా ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. కానీ ఆమె సోషల్ మీడియా పోస్ట్ హన్సిక పరోక్ష సమాధానంగా ఇచ్చారు. 

హన్సిక మోత్వానీ సమాధానం

హన్సిక తన పోస్ట్‌లో, "గొడవలు పడి మళ్ళీ మంచి చేయడానికి నేను చాలా ప్రయత్నం చేశాను..." #Word! Just Mute People అని రాసి నవ్వుతున్న ఎమోజీని కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ తన వదినను ఉద్దేశించే చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.

అంతేకాకుండా హన్సిక వదిన ముస్కాన్ తన భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త మోనా మోత్వానీ, మరియు మరదలు హన్సిక మోత్వానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిపై గృహ హింస ఆరోపణలు చేశారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో మోత్వానీ కుటుంబ సభ్యులపై భారతీయ శిక్షాస్మృతిలోని 498-A, 323, 504, 506, 34వ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ముస్కాన్ నాన్సీ జేమ్స్ పోలీసులకు ఫిర్యాదు

పింక్‌విల్లా నివేదిక ప్రకారం, హన్సిక, ఆమె తల్లి మోనా తన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా  జోక్యం చేసుకున్నారని ముస్కాన్ ఆరోపించారు. దీని వల్లే తనకూ, ప్రశాంత్‌కూ మధ్య సంబంధం చెడిపోయిందని ఆమె చెప్పారు.

ముస్కాన్ తన భర్తపై కూడా గృహ హింస ఆరోపణలు చేశారు. వారు చేసిన వేధింపుల వల్ల తనకు బెల్స్ పాల్సీ అనే తీవ్రమైన సమస్య వచ్చిందని ఆమె చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ముస్కాన్ ముఖం పక్షవాతానికి గురైంది.
 

ముస్కాన్ నాన్సీ జేమ్స్ ఫిర్యాదు

అదేవిధంగా హన్సికతో సహా మోత్వానీ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు తనను ఖరీదైన బహుమతులు,డబ్బులు అడిగారని ముస్కాన్ నాన్సీ జేమ్స్ తెలిపారు. ఆస్తికి సంబంధించిన అక్రమ కార్యకలాపాల్లో కూడా ముగ్గురూ పాల్గొన్నారని ముస్కాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఈ-టైమ్స్ ధృవీకరించింది.

టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ 2020లో హన్సిక మోత్వానీ సోదరుడు ప్రశాంత్ మోత్వానీని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకే ముస్కాన్ ముఖ పక్షవాతంతో బాధపడి చికిత్స పొందుతున్నారు. హన్సిక వివాహానికి కూడా ముస్కాన్ హాజరు కాలేదు.

Latest Videos

click me!