శ్రేయా, శిలాదిత్య పెళ్లి చేసుకునే ముందు పదేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఒక స్నేహితుడి వివాహంలో శిలాదిత్య తనకు ప్రపోజ్ చేసినట్లు శ్రేయా ఒకసారి చెప్పింది. శ్రేయా, శిలాదిత్య 2015లో వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, బంధువులకు శ్రేయా పెళ్లి గురించి తెలిసినప్పటికీ, ఆమె అభిమానులందరికీ షాకింగ్ పరిణామం.
వీరికి 2021లో ఒక అబ్బాయి జన్మించాడు. పేరు దేవయాన్. బెంగాల్ కి చెందిన శ్రేయా ఘోషల్ ఏకంగా 5 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకుంది. దేశంలోనే నెంబర్ వన్ ఫిమేల్ సింగర్. పలు భాషల్లో వేల పాటలు పాడారు.