NTR: పబ్లిక్ లో చిరంజీవిని అవమానించిన ఎన్టీఆర్... అతి పెద్ద వివాదం వెనుక అసలు కథ ఇదే!

Published : May 20, 2022, 04:47 PM ISTUpdated : May 20, 2022, 05:02 PM IST

స్టార్స్ కెరీర్ లో వివాదాలు చాలా సాధారణం. జూనియర్ ఎన్టీఆర్ సైతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ అవమానించడంతో, నాగార్జున చివాట్లు పెట్టారట. ఇది జరిగి చాలా కాలం అవుతుండగా అసలు ఏం జరిగిందో చూద్దాం..   

PREV
16
NTR: పబ్లిక్ లో చిరంజీవిని అవమానించిన ఎన్టీఆర్... అతి పెద్ద వివాదం వెనుక అసలు కథ ఇదే!
NTR - Chiranjeevi

ఎన్టీఆర్ (NTR) కెరీర్లో ఏడవ చిత్రం సింహాద్రి. రాజమౌళి రెండవ చిత్రం. స్టూడెంట్ నంబర్ 1 మూవీ కోసం మొదటిసారి ఎన్టీఆర్-రాజమౌళి పనిచేశారు. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రాజమౌళి(Rajamouli)కి పెద్దగా ఇమేజ్ రాలేదు. దీంతో సింహాద్రి మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైంది. 
 

26
NTR - Chiranjeevi

2003లో విడుదలైన సింహాద్రి (Simahadri) భారీ విజయం సొంతం చేసుకుంది. పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది చిత్రాల తర్వాత సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ ఓ రేంజ్ కి చేరింది. స్టార్స్ లిస్ట్ లో చేరిన ఎన్టీఆర్ వెంట మీడియా పడింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఓ వివాదాస్పద కామెంట్ చేశారనే పుకార్లు చక్కర్లు కొట్టింది. 
 

36
NTR - Chiranjeevi

ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ని చిరంజీవి(Chiranjeevi) గురించి అడుగగా.. ఆయనెవరో నాకు తెలియదు. నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాత ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పారట. లైవ్ లో ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ కి నాగార్జున రియాక్ట్ అయ్యారట. వెంటనే సదరు ఛానల్ కి ఫోన్ చేసి, ఎన్టీఆర్ తో మాట్లాడి హెచ్చరించాడట. అప్పట్లో ఈ వార్త మీడియాను షేక్ చేసింది. 
 

46
NTR - Chiranjeevi

మరి నిజంగానే ఎన్టీఆర్ చిరంజీవిని అవమాన పరిచాడా? లేక ఇది కట్టుకథేనా? అని విచారిస్తే షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ఇదంతా ఓ వెబ్ సైట్ ప్రచారమని తేలింది. హైప్ కోసం ఓ వెబ్ సైట్ ఎన్టీఆర్ చిరంజీవిని అవమానించారంటూ నిరాధార కథనం ప్రచురించారు. ఈ సైట్ చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడికి చెందింది. ప్రస్తుతం నిర్మాతగా కూడా మారిన ఆ వ్యక్తి తర్వాత వివరణ ఇచ్చారు. 
 

56
NTR - Chiranjeevi

తనకు తెలియకుండా... సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సెన్సేషన్ కోసం క్రియేట్ చేసిన ఈ  వార్తలో ఎటువంటి నిజం లేదు. చిరంజీవి గురించి ఎన్టీఆర్ ఎలాంటి అవమానకర కామెంట్స్ చేయలేదని లేఖ విడుదల చేశారు. నాగార్జున సైతం ఈ పుకార్లను ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం ఎన్టీఆర్ చిరంజీవిని చాలా గౌరవిస్తారని వెల్లడించారు. 

66
NTR - Chiranjeevi

అయితే ఈ పుకార్లను జనాలు బాగా నమ్మారు. రెండు మూడు హిట్స్ తో ఎన్టీఆర్ కి గర్వం వచ్చింది. చిరంజీవి లాంటి స్టార్ ని అవమానిస్తాడా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆయన నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. మరలా రాజమౌళి యమదొంగ సినిమాతో కమ్ బ్యాక్ అయ్యాడు.

click me!

Recommended Stories