Rajamouli: తెలుగు సినిమాను ఖ్యాతిని బాహుబలి సినిమాతో విశ్వవ్యాప్తం చేశాడు రాజమౌళి. ఎన్నేళ్లైనా బాహుబలి సినిమాకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటిది.. రాజమౌళిని పట్టుకుని తీశావులే బోడి బాహుబలి అని తిట్టింది ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు
టాలీవుడ్ ను ఫిల్మ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ అంటే ఒకప్పుడు చిన్నచూపు చూసిన బాలీవుడ్, కోలీవడ్ ఇండస్ట్రీలకు తన సినిమాలతో షాక్ ఇచ్చాడు జక్కన్న. ప్రస్తుతం ఇండియాన్ సినిమా అంటే టాలీవుడ్ అనే స్థాయికి తెలుగు పరిశ్రమ ఎదిగిందంటే దానికి కారణం కూడా రాజమౌళే. పాన్ ఇండియా సినిమాలకు నాంది పలికిన మూవీ కూడా బాహుబలే. ఆ సినిమా అంటే అద్భుతం అంటుంటారు అంతా. కానీ బాహుబలిని పట్టుకుని బోడి సినిమా అంటూ రాజమౌళి ఎదురుగానే అవమానించింది ఎవరో తెలుసా? ఎవరో కాదు రాజమౌళి వదిన, ఎమ్ ఎమ్ కీరవాణి భార్య వల్లి.
25
'బాహుబలి' ప్రభంజనం & బాక్సాఫీస్ రికార్డులు
2013లో ప్రారంభమైన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రాన్ని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్ విజువల్ వండర్‌గా రూపొందించారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా 2015లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ప్రభాస్‌ను పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత 2017లో వచ్చిన 'బాహుబలి: ది కంక్లూజన్' ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ చిత్రసీమ రికార్డులను తిరగరాసింది.
35
నేచురల్ స్టార్ నాని చెప్పిన సీక్రెట్..
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణిల కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికి తెలిసిందే. ఈ రెండు కుటుంబాలు కలిసే ఏ సినిమా అయినా తీస్తుంటారు. ఈ ఫ్యామిలీ గురించి.. వారి పనితనం గురించి ప్రతీ సినిమా టైమ్ లో ఆసక్తికర వార్తలు వింటూనే ఉంటాం. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, అంతటి గొప్ప విజయాన్ని సాధించిన సినిమాపై కీరవాణి భార్య శ్రీవల్లి (వల్లి) స్పందించిన తీరుకు సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతోంది. ఆ సీక్రెట్ ను వెల్లడించింది కూడా ఎవరో కాదు.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.
దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమోగుతున్న సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను హీరో నాని గుర్తుచేసుకున్నారు. 'బాహుబలి' విడుదలైన కొత్తలో నాని, రాజమౌళి ఇంటికి వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉన్నారట. ఆ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ.. "మళ్ళీ బాహుబలి సినిమా చూసేందుకు వెళదాం, టికెట్లు బుక్ చేయండి" అని అన్నారట.
దానికి కీరవాణి భార్య వల్లి స్పందిస్తూ.. "తీశావులే ఓ బోడి బాహుబలి సినిమా.. మళ్ళీ వెళ్ళాలా!" అంటూ చాలా తేలికగా తీసిపడేశారట. ఈ మాట వినడానికి రాజమౌళిని అవమానించినట్లు అనిపించినప్పటికీ, నిజానికి ఆమె రాజమౌళిని ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని నాని స్పష్టం చేశారు. వాళ్ల ఫ్యామిలీ బాండింగ్ అలా ఉంటుంది. వల్లి ఎప్పుడూ నిజాయితీగా, ముక్కుసూటిగా అభిప్రాయాలను చెప్పే గొప్ప విమర్శకురాలని ('రివ్యూవర్') నాని అన్నారు. తన సినిమాలు విడుదలైన తర్వాత కూడా వల్లికి ఫోన్ చేసి అడిగితే ఎంతో నిష్పాక్షికంగా ఫీడ్‌బ్యాక్ ఇస్తారని చెప్పారు.
55
బాహుబలి ప్రాజెక్ట్‌లో వల్లి పాత్ర
ోంవల్లి కేవలం సినిమాలపై కామెంట్లు చేయడం మాత్రమే కాదు.. రాజమౌళి సినిమాల్లో మేజర్ వర్క్ ఆమెనే చూసుకుంటారు. ముఖ్యంగా 'బాహుబలి' చిత్ర నిర్మాణంలో ఆమె లైన్ ప్రొడ్యూసర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సినిమా నిర్మాణంలో వేర్వేరు బాధ్యతలు తీసుకుంటారు. నానికి రాజమౌళి కుటుంబంతో 'ఈగ' సినిమా సమయం నుంచే ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఏరికోరి చేసుకునే విమర్శల కంటే ఇంట్లోని వారి నిజాయితీతో కూడిన అభిప్రాయాలే మనిషిని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. రాజమౌళి సాధించిన అంతర్జాతీయ విజయాల వెనుక ఆయన కుటుంబ సభ్యుల నిష్పాక్షికమైన అభిప్రాయాలు, ప్రోత్సాహం ఎంతో ఉన్నాయని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.