జోసెఫ్, నినెట్టే దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసెఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు ఇద్దరు అబ్బాయిలు జోసెఫ్ కి సంతానంగా ఉన్నారు. చెన్నై కి సమీపంలో గల పల్లవరం లో వీరు గతంలో నివసించేవారని తెలుస్తుంది. కాగా గత మూడేళ్ళలో సమంత జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ కి గురైంది.
విడాకుల వేదన నుండి బయటకు పడే లోపు.. మరో సమస్యలో ఆమె చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడిన సమంత రెండేళ్లకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్ లో తనకు మయోసైటిస్ సోకినట్లు సమంత వెల్లడించారు.