అయ్యో ఆ నాలుగు సినిమాలు చేసి ఉంటే బాగుండేది... విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసి బాధపడ్డ బ్లాక్ బస్టర్స్!

Published : May 17, 2024, 09:32 AM IST

జీవితంలో నిర్ణయాలే సక్సెస్ ఫెయిల్యూర్స్ ని నిర్ణయిస్తాయి. చిత్ర పరిశ్రమలో జడ్జిమెంట్స్ ఇంకా ముఖ్యం. కాగా ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను విజయ్ దేవరకొండ చేజేతులా వదులుకున్నాడు. అవి చేసి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది..   

PREV
15
అయ్యో ఆ నాలుగు సినిమాలు చేసి ఉంటే బాగుండేది... విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసి బాధపడ్డ బ్లాక్ బస్టర్స్!
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు. టైర్ 1లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న టైర్ 2 హీరో. అయితే విజయ్ దేవరకొండను వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. దానికి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా కారణం. అయితే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయన ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అవి చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరేవాడు. 


 

25
rx 100 movie

దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 కోసం మొదట శర్వానంద్ ని అనుకున్నాడట. రొమాంటిక్ సన్నివేశాల డోస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన రిజెక్ట్ చేశాడట. తర్వాత విజయ్ దేవరకొండను సంప్రదిస్తే ఆయన కూడా రిజెక్ట్ చేశాడట. అర్జున్ రెడ్డి షేడ్స్ ఉన్నాయనే కారణంతో ఆర్ఎక్స్ 100 చేయడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపలేదట. ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

35

రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఈ కథకు పూరి జగన్నాధ్ ఊహించుకున్న హీరో విజయ్ దేవరకొండ. మూవీలో హీరో క్యారెక్టర్ డ్యూయల్ షేడ్స్ కలిగి ఉంటుంది. అందుకే విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడట. దాంతో ఆ ప్రాజెక్ట్ రామ్ పోతినేని వద్దకు వెళ్ళింది. 
 

45

నితిన్-రష్మిక మందాన కాంబోలో విడుదలైన భీష్మ సూపర్ హిట్. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ స్క్రిప్ట్ మొదట విజయ్ దేవరకొండకు వినిపించాడట వెంకీ కుడుముల. విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించాడట. 

 

55

విజయ్ దేవరకొండ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ ఉప్పెన. దర్శకుడు బుచ్చిబాబు సాన విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకుని కథ రాసుకున్నాడట. విజయ్ దేవరకొండ ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడట. దాంతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి బ్లాక్ బస్టర్ పడింది. 
 

click me!

Recommended Stories