ఒకరోజు కూరగాయల కోసం నేను దుకాణానికి వెళ్ళాను. వాడు ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు. నేను ఒకటికి రెండు సార్లు... అన్నా నాకు ఇవ్వు అని అడుగుతున్నాను. వాడు పట్టించుకోవడం లేదు. నేను గట్టిగా అన్నా... కూరగాయలు ఇవ్వు అనగానే... 'పోరా' అని అరిచాడు. అప్పుడు నాకు చాలా అవమానం అనిపించింది. నేను పెద్దయ్యాక డబ్బులు సంపాదించి, కిరాయి మనుషులతో వీడిని కొట్టించాలని అప్పుడు నాకు అనిపించింది, అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
బహుశా బాల్యంలో రాజమౌళి అంతటి పేదరికం అనుభవించడం వల్లనేమో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అతిగా దానధర్మాలు చేయరు. కరోనా సమయంలో ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. రాజమౌళి తక్కువ మొత్తం ఇచ్చాడు. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరదలు సంభవించాయి. నటులు, దర్శక నిర్మాతలు విరాళాలు ఇచ్చారు. రాజమౌళి ప్రకటించిన దాఖలాలు లేవు.