ANR:టాలీవుడ్ లో మొదటి తరం రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన వయసు పెరిగినా.. మనసు మాత్రం 25 దగ్గరే ఆగిపోయింది. 88 ఏళ్ల వయసులో కూడా ఏఎన్నార్ యంగ్ హీరోయిన్ పై చేసిన రొమాంటిక్ కామెంట్ ఏంటో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రలో 'నటసామ్రాట్' అక్కినేని నాగేశ్వరరావు (ANR)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో ఆయనకు ఆయనే సాటి. హీరోయిన్లు కూడా ఏఎన్నార్ తో సినిమా అంటే ఎగిరి గంతేసేవారు. ఆయన కేవలం నటనతోనే కాకుండా, తనదైన సమయస్ఫూర్తి, చమత్కారాలతో చాలా హుషారుగా ఉండేవారు. అందరిని ఆకట్టుకునేవారు. అంతే కాదు ఈవెంట్లలో కూడా తన సంభాషణలతో అందరినీ అలరించేవారు. వయసు పైబడినా ఆయన మనసు ఎప్పుడూ కుర్రాడిలాగే ఉండేదని చెప్పడానికి ఒక సినిమా ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం
24
తమన్నాపై ఏఎన్నార్ రొమాంటిక్ కామెంట్స్..
మిల్కీ బ్యూటీ తమన్నాను చూసి నాగేశ్వరరావు చేసిన రొమాంటిక్ కామెంట్స్ అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి.88 ఏళ్ల వయసులో ఏఎన్నార్ ఒక సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ పక్కనే ఉన్న తమన్నా వైపు తిరిగి, "అమ్మా! నీ వయసు ఎంత?" అని అడిగారు... దానికి ఆమె నవ్వుతూ "23" అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఏఎన్నార్ తనదైన శైలిలో స్పందిస్తూ, "ఈ అమ్మాయిని చూసిన తర్వాత... నా తలపైన జుట్టు లేకపోయినా, ఉన్న జుట్టు తెల్లబడిపోయినా, నా వయసు ప్రస్తుతం 25 ఏళ్లే అని నా మనసు చెబుతోంది" అంటూ నవ్వులు పూయించారు .
34
నాగచైతన్యపై అసూయగా ఉందంటూ..
అంతటితో ఆగకుండా, "నేను ఒక విగ్గు పెట్టుకుని ఈమెతో నటించే ఛాన్స్ నాకెందుకు రాలేదా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు. తమన్నా అప్పట్లో అక్కినేని నాగచైతన్యతో '100% లవ్', తడాక వంటి సినిమాల్లో నటించింది . ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అక్కినేని నాగేవ్వరరావు.. "ఇలాంటి అందమైన అమ్మాయితో నటించే అవకాశం నాకు దొరకలేదు కానీ, నా మనవడు నాగచైతన్యకు దొరికింది... నా ఛాన్స్ వాడు కొట్టేసాడు అనిపిస్తోంది" అంటూ సరదాగా అసూయను వ్యక్తపరిచారు.
ఈ మాటలకు స్టేజ్ పై ఉన్న నాగార్జున, తమన్నాతో పాటు ప్రేక్షకులు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని, మనసు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుందని అక్కినేని నాగేశ్వరరావు నిరూపించారు. ఆయనలోని ఈ రొమాంటిక్ యాంగిల్, సమయస్ఫూర్తి నేటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూనే ఉన్నాయి.