సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా?

First Published Sep 9, 2021, 3:48 PM IST

విజయ్ దేవరకొండ ఈ పేరే ఒక సెన్సేషన్. టాలీవుడ్ లో ఉదయించిన కొత్త స్టార్. యూత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ చూస్తే మతిపోతుంది.

ఎవరైనా ఎదగాలంటే ఇతరుల్లో లేని ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకత విజయ్ దేవరకొండ సొంతం. అతని సినిమాలు ఒకెత్తైతే, ఆఫ్ స్క్రీన్ ఆటిట్యూడ్ మరొక ఎత్తు. కేరీర్ బిగినింగ్ లోనే బహిరంగ వేదికలపై విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.

ఓ చిన్న నటుడిగా కెరీర్ బిగిన్ చేసి, సపోర్టింగ్ హీరోగా ఎదిగి, స్టార్ హోదా దక్కించుకున్నాడు.  పెళ్లి చూపులు చిత్రం విజయ్ దేవరకొండకు హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం కాగా, అర్జున్ రెడ్డి మూవీ అతన్ని ఓవర్ నైట్ స్టార్ చేసింది. 

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సంచలన విజయం నమోదు చేసింది. ట్రెండ్ సెట్టింగ్ కథాంశంతో యూత్ ని ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమా విజయ్ దేవరకొండను ఎక్కడికో తీసుకెళ్లింది. 

అర్జున్ రెడ్డి మూవీ అనేక విమర్శలకు, వివాదాలకు కేంద్రంగా నిలవగా, అవి ఆ సినిమా విజయంలో కొంత పాత్ర పోషించాయి. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

పరిశ్రమను ఏలిన స్టార్స్ యొక్క వారసులు కూడా ఈర్ష్య పడేలా విజయ్ దేవరకొండ ఎదిగారు. విజయ్ దేవరకొండ ఎదిగినంత వేగంగా మరో హీరో పరిశ్రమలో స్టార్డం తెచ్చుకోలేదంటే అతిశయోక్తి కాదు. అది కూడా ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా.

పాన్ ఇండియా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ, సినిమాలలో రాకముందు ఏమి చేసేవారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంటుంది. అందరిలాగే విజయ్ దేవరకొండ కూడా కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్లేవాడట.

సినిమా టికెట్స్ కోసం గంటల తరబడి థియేటర్స్ ముందు ఫ్రెండ్స్ తో ఎదురుచూసిన సందర్భాలు అనేకం అట. హీరో కాకముందు ఓ సాధారణ ప్రేక్షకుడిగా నేను పొందిన అనుభవాలు ఇప్పటి తన ఆడియన్స్ ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయట . 

ఆడియన్స్ పట్ల విజయ్ దేవరకొండ దృష్టి భిన్నంగా ఉంటుందట. నటుడు, ఆడియన్స్ అనే భేదభావం విజయ్ దేవరకొండకు ఉండదట. తన సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను తన ఫ్రెండ్స్ వలె భావిస్తారట. 

పూరి జగన్నాధ్ తో లైగర్ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ, అనంతరం మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ ప్రకటించారు.

click me!