బిగ్ బాస్ హౌస్లో అమర్-ప్రియాంక మధ్య అంత జరిగిందా... ఆటగాడివి అంటూ మేటర్ లీక్ చేసిన రీతూ చౌదరి!

Published : Mar 25, 2024, 04:30 PM IST

ఓ టాస్క్ లో అమర్ దీప్-ప్రియాంక జైన్ పోటీపడ్డారు. అమ్మాయి అని కూడా చూడకుండా అమర్ ఆమెపై దాడి చేశాడు. అయితే తర్వాత ప్రియాంక అతని బాగా ఎంజాయ్ చేశావా? అని అడిగిందట. ఈ మేటర్ ని యాంకర్ రీతూ చౌదరి లీక్ చేసింది.   

PREV
17
బిగ్ బాస్ హౌస్లో అమర్-ప్రియాంక మధ్య అంత జరిగిందా... ఆటగాడివి అంటూ మేటర్ లీక్ చేసిన రీతూ చౌదరి!
Amardeep Chowdary

బిగ్ బాస్ సీజన్ 7లో స్పా బ్యాచ్ గా పేరుగాంచారు శోభ శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్. స్టార్ మా లో పలు సీరియల్స్ లో నటించిన వీరి మధ్య గట్టి అనుబంధం ఉంది. గేమ్ ముగ్గురు కలిసి ఆడారు అనడంలో సందేహం లేదు. వీరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ.

27
Amardeep Chowdary

ఈ క్రమంలో బిగ్ బాస్ వీరి మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టాడు. అమర్-ప్రియాంక ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అందుకే టికెట్ టు ఫినాలే టాస్క్ లో అమర్-ప్రియాంక తలపడాల్సి వచ్చింది. వివిధ దశల్లో జరిగే గేమ్స్ లో పాయింట్స్ ఆధారంగా టికెట్ టు ఫినాలే ఒకరి దక్కుతుంది. 
 

37
Amardeep Chowdary

ఈ టాస్క్ లో బాల్ గేమ్ ఒకటి కండక్ట్ చేశాడు. ఈ క్రమంలో ప్రియాంక వద్ద నున్న బాల్ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశాడు. ప్రియాంక బాల్ వదలకుండా అలానే గట్టిగా పట్టుకుంది. ఎలాగైనా బంతిని తీసుకోవాలని అమర్ దీప్... బలంగా దాడి చేశాడు. ప్రియాంక అమ్మాయి అనే విషయం కూడా మర్చిపోయాడు. ఎక్కడెక్కడో చేతులు వేశాడు. 
 

47
Amardeep Chowdary


ఆమెను ఎత్తి క్రింద పడేస్తాడు. చాలా సేపు ప్రతిఘటించిన ప్రియాంక జైన్ బాల్ వదిలేస్తుంది. దాంతో అమర్ విజయం సాధిస్తాడు. ఈ సంఘటన తర్వాత ప్రియాంక అమర్ తో ... ఎంజాయ్డా? అని అంటుంది. నువ్వు ఈ పెనుగులాటలో నన్ను తాకుతూ నువ్వు ఎంజాయ్ చేసావా? అన్నట్లు ప్రియాంక అన్నది. 

57
Amardeep Chowdary

ఈ విషయాన్ని రీతూ చౌదరి లేవనెత్తింది. ఓ సినిమాలో హీరో, హీరోయిన్ గా నటిస్తున్న అమర్ దీప్, సరిత దావత్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ టాక్ షో హోస్ట్ గా ఉన్న రీతూ చౌదరి బోల్డ్ క్వచ్చన్స్ అడుగుతుంది. బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక జైన్ నీతో 'అమర్ ఎంజాయ్డా?' అని ఎందుకు అడిగిందని రీతూ చౌదరి ప్రశ్నించింది. 
 

67
Amardeep Chowdary


నేను గెలిచాను... నాకు పాయింట్స్ వస్తాయి. నీకు సంతోషమేనా? అన్న అర్థంలో అడిగిందని అమర్ సమాధానం చెప్పాడు. ఎంజాయ్దా అంటే వేరే భావన కలుగుతుంది. నువ్వు మంచి ఆటగాడివే అని రీతూ చౌదరి అనగా... పక్కనే ఉన్న సుప్రీత మంచి ఆటగాడు అంటూ వంత పాడింది. 
 

77
Amar Deep Chowdary


ఈ ఇంటర్వ్యూ అనంతరం ప్రియాంక-అమర్ దీప్ మధ్య హౌస్లో ఇంత వ్యవహారం నడిచిందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కాగా అమర్ దీప్, ప్రియాంక ఫైనల్ కి వెళ్లారు. అమర్ రన్నర్ గా నిలిచాడు. ప్రియాంకకు 5వ స్థానం దక్కింది. అమర్ దీప్-సుప్రీత హీరో హీరోయిన్స్ గా ఇటీవల ఓ సినిమా మొదలైంది. అది చిత్రీకరణ జరుపుకుంటుంది. 

click me!

Recommended Stories