Ashu Reddy - Bigg boss Ott : లాస్ట్ టైం ఏం చేయలేకపోయా .. ఈ సారి పిచ్చెక్కిస్తా అంటోంది అషురెడ్డి..

Published : Feb 27, 2022, 02:17 PM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss nonstop) గ్రాండ్ గా  లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి కంటెస్టెంట్ గా అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో తను ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. 

PREV
16
Ashu Reddy - Bigg boss Ott : లాస్ట్ టైం ఏం చేయలేకపోయా .. ఈ సారి పిచ్చెక్కిస్తా అంటోంది అషురెడ్డి..

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss nonstop) గ్రాండ్ గా  లాంచ్ అయిన విషయం తెలిసిందే..  నాగార్జున (Nagarjuna) హౌస్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో పాత కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ కలిసి గేమ్ ఆడుతుండగా.   కాగా గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, అసలు పాల్గొనని కంటెస్టెంట్స్ ని ఛాలెంజర్స్ గా విభజించారు.  మొదటి కంటెస్టెంట్ గా అషురెడ్డి (Aashu Reddy) ఎంట్రీ ఇచ్చింది. 
 

26

అషురెడ్డి ఎంట్రీతోనే అదుర్స్ అనిపించుకుంది. జూనియర్ సమంతగా పేరుతుకున్న ఈ బ్యూటీ... ‘పుష్ఫ’ మూవీలోని ‘ఊ అంటావా..’ సాంగ్ తో సాలిడ్ ఇంట్రో ఇచ్చింది. హోస్ట్ కింగ్ నాగార్జున కోసం అషురెడ్డి త్రీ రోసెస్ తీసుకొచ్చి ప్రేమగా అందించింది. హౌస్ లోకి వెళుతూ వెళుతూ నాగార్జున బుగ్గపై గట్టిగా కిస్ పెట్టి వెళ్లింది. 

36

అయితే అషురెడ్డి హౌస్ లోకి వెళ్లే ముందుకు  ఒక వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లాస్ట్ టైం బిగ్ బాస్ హౌజ్ లో ఏం చేయలేక పోయాను.. ఈ సారి పిచ్చెక్కిస్తా.. నా శక్తిమేరకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు  ట్రై చేస్తాను. ఈ సారి నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. తప్పకుండా నన్ను ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ తెలిపింది.  
 

46

కాగా, బిగ్ బాస్ ఎంట్రీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంటూ ఒక నోట్ కూడా రాసుకొచ్చింది. ‘నా ప్రియమైన ప్రజలందరికీ, ఒక బిగ్గ్ హాయి... మరియు  హలో...  నా ప్రయాణం బిగ్‌బాస్ OTTలో మళ్లీ ప్రారంభమైంది. ప్రతి రోజూ మీ అందరినీ నాన్‌స్టాప్‌గా అలరిస్తానని హామీ ఇస్తున్నాను. నేను ఈ గేమ్‌ని ఆడటానికి మరియు మీ హృదయాలను గెలుచుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. 
 

56

ఈ ప్రయాణంలో మీ అందరి నుండి నాకు నిరంతర మద్దతు, ప్రేమ ఉండాలని కోరుతున్నాను. నన్ను అణచివేసిన, చీకటిలో పడేసిన ప్రతి ఒక్కరికీ నన్ను నేను నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సందర్భాలు ఉన్నాయి.. వాటిని ఎదుర్కొంటూ మీ అపారమైన ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలతో ఎప్పటిలాగే ఈ షోను విజయవంతం చేద్దాం.. ఇక  ఆశు రెడ్డి గేమ్ అడితే ఎలా ఉంటాదో చూస్తారుగా..’అంటూ రాసుకొచ్చింది.  

66

తాజాగా మొదటి రోజు ఉదయం లేవగానే ఇన్ స్టాలో తన మార్నింగ్ వేక్ అప్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను పలకరించింది. అషురెడ్డి బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీతో అందరూ ఆమెకు ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నారు. అయితే ఈ ఆరో సీజన్ బిగ్ బాస్ షోకు పెద్దగా పిరిమితుల్లేవు. అప్పటికే అషురెడ్డి సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫొటో షూట్లు చేసేది. తన గ్లామర్ తో నెటిజన్లకు పిచ్చెక్కించేది. ఇక ఓటీటీలో ప్రాసరమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ తెలుగులో రచ్చరచ్చ చేయడం ఖాయమే అంటున్నారు.  
 

click me!

Recommended Stories