Bigg Boss 7: నమ్మక ద్రోహం అని మాట్లాడకు, నాలోని మూర్ఖుడు బయటకి వస్తాడు.. ప్రశాంత్ కి అమర్ దీప్ వార్నింగ్

First Published | Nov 27, 2023, 4:18 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. గేమ్ చివరి దశకు చేరుకునే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య హీట్ ఆర్గుమెంట్ పెరిగిపోతోంది. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. గేమ్ చివరి దశకు చేరుకునే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య హీట్ ఆర్గుమెంట్ పెరిగిపోతోంది. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ తప్పులని ఎత్తి చూపిస్తున్నాయి. 

నేడు సోమవారం రోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరగనుంది. గేమ్ అత్యంత కీలక దశలోకి ఎంటర్ అవుతున్న తరుణంలో నామినేషన్స్ కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ నామినేషన్స్ లోకి వెళితే ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇంటి సభ్యులు తమ వాయిస్ పెంచుతున్నారు. తమ వాదనని బలంగా వినిపిస్తున్నారు. 


తాజాగా విడుదలైన ప్రోమోలో ఆ విషయం బయట పడింది. శని, ఆదివారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో రతిక, అశ్విని బయటకి వచ్చేశారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉన్నారు. టాప్ 5 కి చేరుకోవడానికి ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు. 

తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే.. శోభా శెట్టి బలమైన వాయిస్ తో ప్రశాంత్ ని, యావర్ ని ఇరకాటంలో పెట్టేస్తోంది. కానై యావర్ బలంగా తిప్పికొడుతున్నాడు. ప్రశాంత్ మాత్రం ఎమోషనల్ అవుతున్నాడు. నన్ను ఎలా నామినేట్ చేస్తావు అంటూ యావర్ ప్రశ్నిస్తున్నాడు. 

ఇక అమర్ దీప్ కూడా ప్రశాంత్ ని నామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. దీనితో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్ను నమ్మినందుకు నేను భాదపడాల్సి వస్తోంది అని కామెంట్స్ చేశాడు. దీనితో అమర్ స్పందిస్తూ.. నమ్మక ద్రోహం అనే మాట అనకు. అంటే నాకన్నా మూర్ఖుడు ఉండడు అని వార్నింగ్ ఇచ్చాడు. 

ప్రశాంత్ రైతు బిడ్డ కాబట్టి అతడికి శివాజీ సపోర్ట్ చేయడాన్ని గౌతమ్ తప్పు పట్టాడు. అలాగే శోభా శెట్టి కూడా ప్రశాంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో గౌతమ్, శివాజీ మధ్య పెద్ద రచ్చే జరిగింది. మరి ఈ రచ్చ ముగిసి చివరికి నామినేషన్స్ లో ఎవరు ఉంటారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. 

Latest Videos

click me!