నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రనే సాగుతోంది. నామమాత్రంగా సినిమాలు చేస్తోంది. వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకుంటోంది. కొత్తగా ప్రయత్నాలేమీ లేవని కనిపిస్తోంది.
సినిమాల జోరు కాస్తా తక్కువే ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే సందడి మాత్రం అంతాఇంతా కాదు. తన అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన గురించిన అప్డేట్స్ ను మాత్రం అందిస్తోంది.
ఈ క్రమంలో తననుంచి అభిమానులకు అందాల్సిన గ్లామర్ ట్రీట్ ను కూడా పంచుతోంది. ఊహించని విధంగా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. అందాల ప్రదర్శనతో నెట్టింట ఆటంబాంబ్ లా పేలుతోంది.
తాజాగా పూనమ్ బజ్వా గ్లామర్ బాంబ్ పేల్చింది. బ్లూ స్విమ్ సూట్ లో ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులను ప్రదర్శించింది. పలుచుని దుస్తుల్లో అందాల షేపులను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది.
ఇలా పూనమ్ బజ్వా బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూనే వస్తోంది. తనలోని అందాల కోణాలు ఆశిష్కరిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ పంచుకునే ఫొటోలను క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.
ఇక పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులను కింగ్, అక్కినేని నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంలో హీరోయిన్ గా అలరించింది. అంతకు ముందు ‘మొదటి సినిమా’, ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది.