డైరెక్టర్ వివి వినాయక్ మాస్ చిత్రాల దర్శకుడిగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఘనత వినాయక్ సొంతం. వినాయక్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవరెడ్డి నిరాశపరిచింది. కానీ ఆ చిత్రాన్ని ఇప్పటికి మాస్ ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు.