టాలీవుడ్ లో ఓ హీరో ప్రస్తావన వచ్చినప్పుడల్లా చిరంజీవిపై నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. దీనిపై దర్శకుడు విఎన్ ఆదిత్య క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎదుగుతూ శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు టాలీవుడ్ కి వచ్చి స్టార్స్ గా రాణిస్తున్నారు. అయితే చిరంజీవి ఫ్యామిలీపై తరచుగా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఏదైనా సంఘటన జరిగినా, ఏవారైనా హీరో ఫెయిల్ అయినా చిరంజీవే కారణం, తొక్కేశారు ఆమె మాటలు వినిపిస్తుంటాయి.
25
ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి
దానికి ఉదాహరణగా ఉదయ్ కిరణ్ పేరు చెబుతుంటారు. ఉదయ్ కిరణ్ మరణాన్ని ప్రస్తావిస్తుంటారు. దీనిపై ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు విఎన్ ఆదిత్య స్పందించారు. ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి. మనంతట మనం అవకాశాలు క్రియేట్ చేసుకోవచ్చు. సొంతంగా ఏమైనా చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్న ఇండస్ట్రీలో సూసైడల్ థాట్స్ రావడం కరెక్ట్ కాదు.
35
ఇంకా ఎన్నేళ్లు చిరంజీవిని బ్యాడ్ చేస్తారు ?
ఉదయ్ కిరణ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చిరంజీవి గారిని బ్యాడ్ చేయడం మన లక్ష్యం కాకూడదు. ఉదయ్ కిరణ్ గురించి బాధపడండి. అంతే కానీ ఉదయ్ కిరణ్ గుర్తుకు రాగానే చిరంజీవిపై నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా ఎన్నేళ్లు ఇలా చిరంజీవి గారిని బ్యాడ్ చేయాలని చూస్తారు ? ఒకరి జీవితాన్ని చూసి మరొకరిని బ్యాడ్ చేయాలి అనుకోవడం మనలో ఉండే నెగిటివ్ ఎనెర్జీ అది.
నా దృష్టిలో చిరంజీవి గారి స్థాయికి అసలు ఉదయ్ కిరణ్ ఫోకస్ లో ఉండడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒకడిని తొక్కాలి అనే అవసరం ఏముంటుంది ? ఆయన వాళ్ళ అబ్బాయి రాంచరణ్ కెరీర్ పై ఫోకస్ పెడతాడు కానీ వేరేవాళ్ళ కెరీర్ పై ఎందుకు ఫోకస్ పెడతాడు ?
55
రవితేజ, నాని, తరుణ్ వీళ్లంతా ఎలా వచ్చారు ?
ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్త స్టార్లు వస్తూనే ఉంటారు. వారందరినీ తొక్కేయడం చిరంజీవికి సాధ్యం అవుతుంది. అదే నిజం అయితే రవితేజ, నాని, నితిన్, తరుణ్ వీళ్లంతా ఎలా స్టార్లు అయ్యారు. వాళ్లందరినీ కూడా చిరంజీవి తొక్కేసి ఉండాలి కదా అని విఎన్ ఆదిత్య అన్నారు.