Cult Review: కల్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ.. విశ్వక్ సేన్‌ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడా?

Published : Oct 29, 2026, 09:51 AM IST

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం `#కల్ట్`. ఇండియన్‌ తొలి స్లాషర్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది.

PREV
13
విశ్వక్‌ సేన్‌ కల్ట్ ఇండియా తొలి స్లాషర్‌ ఫిల్మ్

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మరోసారి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం `#కల్ట్`. ఇందులో ఆయనే హీరో. ఇండియాలోనే తెరకెక్కిన తొలి స్లాషర్‌ ఫిల్మ్ ఇది. గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, విశాఖ్‌ నాయర్‌, కార్తికేయ, అనేరుధ్‌ భాస్కర్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ మ్యూజిక్‌ అందించారు. తారక్‌ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ కాకరాల నిర్మించారు. ఈ చిత్రం రేపు శుక్రవారం(అక్టోబర్ 30)న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ ఏంటనేది చూద్దాం.

23
కల్ట్ మూవీ సెన్సార్‌ టాక్‌

ఈ సినిమా ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. `ఏ` సర్టిఫికేట్‌ వచ్చింది. చాలా వరకు కట్స్, బ్లర్‌, మ్యూట్స్ ఇచ్చారట సెన్సార్‌ వాళ్లు. దీంతో అవి కట్‌ చేసి, మ్యూట్‌ చేసిన తర్వాత కూడా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్‌ రావడం ఆశ్చర్యపరుస్తోంది. సినిమాలో ఎంత హింస ఉంటుందని, ఎంతటి బోల్డ్ డైలాగ్‌లు, హింసాత్మకమైన సీన్లు ఉంటాయనేది తెలుస్తోంది. సినిమా నిడివి రెండున్నర(2.32) గంటలు అని సమాచారం. డీసెంట్‌ నిడివినే అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి పెద్దగా బజ్‌ లేదు. పెద్దగా ప్రమోషన్‌ లేదు. దీంతో సినిమా వస్తుందా లేదా అనే డౌట్‌ కూడా ఉంది. ఈ క్రమంలో నేడు టీమ్‌ ప్రెస్‌ మీట్‌ని నిర్వహిస్తున్నారు. రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు.

33
కల్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ

సినిమా కథేంటనేది చూస్తే, ఇందులో విశ్వక్‌ సేన్‌ పవర్‌ఫుల్ డీఎస్పీ సంకల్ప్ పాత్రలో కనిపిస్తాడు. ఒక హౌజ్‌లో కొందరు పార్టీ చేసుకుంటారు. విలన్(స్లాషర్) ఆర్డర్స్ ఇస్తుంటాడు. దానికి తగ్గట్టుగా అందులో ఉన్నవాళ్లు చేయాలి. లేదంటే చంపేస్తుంటారు. దారుణంగా చంపుతుంటారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడివారు ఉంటారు.

ఈ కేసు గురించి సంకల్ప్ కి తెలుస్తుంది. మొదట ఆయన పెద్దగా సీరియస్‌గా తీసుకోడు, కానీ జరిగిన విషయాలు చూసి షాక్‌ అవుతాడు. విలన్‌ని ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో తన పాత్రలోని ట్విస్ట్ ఏంటనేది ఆసక్తికరం. సినిమా ఇంటెన్స్ థ్రిల్లర్‌, యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందట. ఒక్కో సీన్‌ భయం పుట్టించేలా ఉంటుందట.

సినిమా ప్రారంభమైన కాసేపటికే పూర్తి స్లాషర్‌ జోన్లోకి వెళ్లిపోతుందని, ఒళ్లుగగుర్పొడిచే సీన్లు ఉంటాయని అంటున్నారు. అయితే సినిమాలో యాక్షన్‌ ఓవర్‌గా ఉంటుందట. అది ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరం. దాన్ని బట్టే సినిమా ఆడియెన్స్ కి నచ్చుతుంది. ఇది మనకు కొత్త కాబట్టి ఇప్పుడే ఊహించడం కష్టమని అంటున్నారు. మరి ఒరిజినల్‌ ఏసియానెట్‌ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories