దశాబ్దాలుగా ప్రతి సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం సంచలనం రేపింది. అమెరికన్ హీరోయిన్స్, ఆర్టిస్ట్స్ తమకు ఎదురైన లైంగిక వేధింపులు బయటపెట్టారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన ప్రముఖులు జైలు పాలయ్యారు.
ఇండియాలో తనుశ్రీ దత్తా, శ్రీరెడ్డి, చిన్మయి శ్రీపాదతో పాటు మరికొందరు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఇటీవల కేరళ చిత్ర పరిశ్రమను జస్టిస్ హేమ రిపోర్ట్ కుదిపేసింది. మాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై సదరు కమిటీ అధ్యయనం చేసింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. దేశంలో మరే చిత్ర పరిశ్రమలో లేని విధంగా మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని ఆ కమిటీ తేల్చింది.