ఒంటినిండా నగలున్నా నడుమే మెరుస్తోందిగా.. పట్టుచీరలో కట్టిపడేస్తున్న విష్ణుప్రియా.. బ్యూటీఫుల్ ఫొటోస్

First Published | Nov 17, 2023, 5:44 PM IST

యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం నటిగా అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ తోనూ బిజీగా మారుతోంది. ఈ క్రమంలో బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా రాయల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

యంగ్ బ్యూటీ విష్ణుప్రియా (Vishnupriya Bhimeneni)  ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా అందిస్తూ అలరిస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. 
 

విష్ణుప్రియ నెట్టింట ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. రీల్స్, ఫొటోషూట్లతో ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. తన వర్కౌట్ వీడియోలతోనూ ఈ ముద్దుగుమ్మ అభిమానులను ఫిదా చేస్తుంటుంది. స్టంట్స్ కొడుతూ ఆశ్చర్యపరుస్తుంటుంది.
 


ఇటీవల ఈ ముద్దుగుమ్మ వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. చీరకట్టులో అందాల విందు చేస్తూ మతులు చెడగొడుతోంది. తాజాగా విష్ణుప్రియ పంచుకున్న ఫొటోల్లో మాత్రం రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. 

క్లాథింగ్, జ్యూవెల్లరీకి సంబంధించిన ఓ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ విష్ణుప్రియా బ్యూటీఫుల్ గా ఫొటోషూట్ చేసింది. ఈ సందర్భంగా పట్టుచీర, మెరిసిపోయే నగలను ఒంటినిండా ధరించింది. 

సంప్రదాయ దుస్తుల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఇక తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. ఈ క్రమంలో విష్ణు ప్రియా ఇచ్చిన ఫొటో స్టిల్స్ అభిమానులతో పాటు నెటిజన్లనూ కట్టిపడేస్తున్నాయి. 
 

ఒంటినిండా బంగారం మెరుస్తున్నా.. నడుము అందాలను మరింతగా మెరిపించింది. చూపుతిప్పుకోనివ్వని ఫోజులతో కట్టిపడేసింది. మత్తు చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. నెటిజన్లు ఆ ఫొటోలను లైక్ చేస్తూ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

రీసెంట్ గా విష్ణుప్రియా ‘దయా’ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. కీలక పాత్రలో మెప్పించింది. అంతకు ముందు ‘జరీ జరీ పంచెకట్టు’ అనే స్పెషల్ సాంగ్ తో వెండితెరపై గ్లామర్ స్టెప్పులేసింది. యాంకర్ గా కొన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన విషయం తెలిసిందే.
 

అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిగానే సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. మరిన్ని ఆఫర్స్ ను దక్కించుకునేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తోంది. గతంలో ‘మయూకం’, ‘చెక్ మేట్’, ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. 
 

Latest Videos

click me!