Bigg Boss Telugu 7: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్... హౌస్ నుండి ఆ ఇద్దరు అవుట్?

Sambi Reddy | Updated : Nov 17 2023, 05:48 PM IST
Google News Follow Us

ఉల్టా ఫల్టా అంటూ బిగ్ బాస్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. కాగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఓటింగ్ చివరి దశకు చేరగా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ వెళ్ళిపోతారట. 
 

16
 Bigg Boss Telugu 7: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్... హౌస్ నుండి ఆ ఇద్దరు అవుట్?
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ తెలుగు 7 మరో ఐదు వారాల్లో ముగియనుంది. హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రస్తుతం శివాజీ హౌస్ కెప్టెన్ గా ఉన్నాడు. గత ఆదివారం భోలే ఎలిమినేట్ అయ్యాడు. 11వ వారం నామినేషన్స్ లో యావర్, అమర్, అర్జున్, అశ్విని, ప్రియాంక, శోభ, రతిక, గౌతమ్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ ఒక్కడే నామినేట్ కాలేదు. 

 

26
Bigg Boss Telugu 7

వీరిలో ఎవరు ఇంటిని వీడుతారనే ఉత్కంఠ నెలకొంది. యావర్ భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడని సమాచారం. శివాజీ, ప్రశాంత్ లకు యావర్ మిత్రుడు. వారిద్దరూ నామినేషన్స్ లో లేరు. ఈ కారణంగా వారిద్దరి అభిమానుల ఓట్లు యావర్ కి షిఫ్ట్ అయ్యాయట. 
 

36
Bigg Boss Telugu 7

రెండో స్థానంలో అమర్ ఉన్నాడట. అనూహ్యంగా మూడో స్థానంలో రతిక, నాలుగో స్థానంలో అశ్విని ఉన్నారట. గౌతమ్ ఐదో స్థానంలో, అర్జున్ ఆరో స్థానంలో ఉన్నారట. ప్రియాంక, శోభ చివరి రెండు స్థానాల్లో ఉన్నారట. లెక్క ప్రకారం వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. 

 

బాత్ రూమ్ లో ఒంటరిగా గుక్క పట్టి ఏడ్చిన శోభ... దానికి పిచ్చి*** అంటూ అమర్ బూతులు!

Related Articles

46
Bigg Boss Telugu 7

అలా కాకుండా... డబుల్ ఎలిమినేషన్ ద్వారా రతిక, అశ్వినిలను ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. రతిక 4వ వారం ఎలిమినేటైంది. బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇవ్వడంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక అశ్విని వైల్డ్ కార్డు ఎంట్రీ. 5వ వారం మినీ లాంచ్ ఈవెంట్ తో హౌస్లో అడుగుపెట్టింది. 

 

56
Bigg Boss Telugu 7

ప్రియాంక, శోభ శెట్టిలను ఎలిమినేట్ చేసే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం లేదట. స్టార్ మా వాళ్ళు సీరియల్ బ్యాచ్ కి గట్టి హామీ ఇచ్చి హౌస్లోకి పంపినట్లు తెలుస్తుంది. శోభ ఫైనల్ కి వెళ్లకున్నా... ప్రియాంకకు బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. కాబట్టి శోభ, ప్రియాంక ఇంటిని వీడే సమస్యే లేదు. 

66
Bigg Boss Telugu 7

డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరిని పంపిస్తే లెక్క సరిపోతుంది. మరో ముగ్గురు 12, 13, 14 వారాల్లో ఎలిమినేట్ అవుతారు. మిగిలిన 5 మంది టాప్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి వెళతారు. డబుల్ ఎలిమినేషన్ లేని పక్షంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. గత సీజన్లో శ్రీసత్యను అలానే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి... 

 

Bigg Boss Top 5: టాప్ 5 ఎవరో లీక్ చేసిన భోలే షావలి... రసవత్తరంగా టైటిల్ రేస్!

Read more Photos on
Recommended Photos