విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ లో కొత్త వ్యాపారం ప్రారంభించింది. దీని ద్వారా ఆమె ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. అబ్బాయిల వీక్ నెస్ క్యాష్ చేసుకుంటోంది అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.
బుల్లితెరపై గ్లామర్ క్వీన్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియా ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విష్ణు ప్రియా బుల్లితెరపై చాలా షోలకు యాంకర్ గా పనిచేసింది. సుధీర్ తో కలసి ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అదే విధంగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంది. ప్రస్తుతం ఆమెని ఇంస్టాగ్రామ్ లో 1.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
25
బెట్టింగ్ యాప్స్ వివాదం
కొంత కొంత కాలం క్రితం విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వివాదంలో నిలిచింది. చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీల పై బెట్టింగ్ యాప్స్ వివాదంలో కేసులు నమోదయ్యాయి. వారిలో విష్ణుప్రియ కూడా ఒకరు. ఆ వివాదం ముగిసింది అనుకుంటున్నా తరుణంలో విష్ణు ప్రియా కొత్త దందా షురూ చేసింది.
35
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటూ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లేకపోవడంతో ఆదాయం కోసం విష్ణుప్రియ కొత్త యాపారం మొదలు పెట్టింది. అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటూ విష్ణు ప్రియా నెలకు ఏకంగా 11 లక్షలకు పైగా సంపాదిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ మొదలు పెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాని సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి అంటే నెలకు రూ 390 రూపాయలు చెల్లించాలి.
అలా సబ్ స్క్రైబ్ చేసుకుంటే వారి కోసం విష్ణుప్రియ ఎక్స్ క్లూజివ్ గా హాట్ ఫొటోస్, వీడియోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే విష్ణుప్రియ ఇన్స్టా ఖాతాని ఏకంగా 2970 మంది సబ్ స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. అంటే వారు ఒక్కొక్కరు రూ .390 చెల్లిస్తారు. ఆ విధంగా విష్ణుప్రియకి 11 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది.
55
ఇల్లీగల్ కాదు
విష్ణుప్రియ చేస్తున్న ఈ కొత్త దందాని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకోవడమే ఇది అని అంటున్నారు. ఎవ్వరూ విష్ణుప్రియ ఖాతాని సబ్ స్క్రైబ్ చేసుకోవద్దు అని సూచిస్తున్నారు. దీనిపట్ల మరో వాదన కూడా వినిపిస్తోంది. విష్ణుప్రియ చేస్తున్నది ఇల్లీగల్ కాదు. ప్రస్తుతం సెలెబ్రిటీలు తమ ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కోసం ఇలాగే రూల్స్ ప్రకారం ఛార్జ్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ రూల్ ప్రకారమే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.