2025 సంవత్సరానికి తమిళ సినిమాకి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది విశాల్. సుందర్ సి దర్శకత్వంలో ఆయన నటించిన మదగజరాజా సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా 12 ఏళ్లుగా విడుదల కాకుండా ఇప్పుడు విడుదలైంది. సంతానం కామెడీ, విశాల్ యాక్షన్, అంజలి, వరలక్ష్మి గ్లామర్ తో పక్కా కమర్షియల్ సినిమాగా మదగజరాజా ఈ సంవత్సరం సంక్రాంతి విజేతగా నిలిచింది.