ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో 40 ప్లస్ హీరోయిన్లు కూడా సత్తా చాటుతున్నారు. గతంలో 40 ప్లస్ హీరోయిన్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉండేవి. ఒక వేళ ఛాన్సులు వచ్చినా తల్లి, అత్త, సోదరి తరహా యాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేది. కానీ కొందరు సౌత్ హీరోయిన్లు నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతున్నారు. వారిలో ప్రధానంగా త్రిష గురించి చెప్పుకోవాలి.