కిసీ కా భాయ్..కిసీ కి జాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ, సల్మాన్ ఖాన్ ను కన్ ఫ్యూజన్ లోకి నెట్టిన ట్విట్టర్ జనాలు

Published : Apr 21, 2023, 05:41 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్టేజియస్ మూవీ కిసీ కా బాయ్ కిసీ కి జాన్. 2014 లో రిలీజ్ అయిన తమిళ సినిమా వీరమ్‌ సినిమాను   హిందీలో సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్ ఖాన్ నిర్మించారు. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈసినిమా పక్కా సౌత్ వాసనలతో తెరకెక్కింది. మరి ఈసినిమాతో సల్మాన్ ఖాన్ హిట్ కొట్టగలడా. ఈరోజు(21 ఏప్రిల్ ) రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఏమంటున్నాడు.. ట్విట్టర్ లో వారి రివ్యూలేంటి చూద్దాం. 

PREV
18
కిసీ కా భాయ్..కిసీ కి జాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ, సల్మాన్ ఖాన్  ను  కన్ ఫ్యూజన్ లోకి నెట్టిన ట్విట్టర్ జనాలు
kisi ka bhai kisi ki jaan releasing tomorrow salman khan total screen count nsn

సల్మాన్ ఖాన్, పూజా హెడ్డే జంటగా.. టాలీవుడ్ సీనియర్ హీరో  వెంకటేష్  భూమిక, జగపతిబాబు  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్. షారుఖ్ మాదిరి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న తాపత్రేయంలో ఉన్న సల్మాన్ ఖాన్.. చాలా ప్రస్టేజియస్ గా తీసుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఓ సాంగ్ లో సల్మాన్ అండ్ వెంకటేష్ తో కాలు కదిపారు. దాంతో ఈసినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి సినిమా  చూసిన ట్విట్టర్ ఆడియన్స్ ఏమంటున్నారంటే..? 

28
Kisi Ka Bhai Kisi Ki Jaan trailer salman khan Venkatesh pooja hegde Farhad Samji nsn

ఈసినిమాపై కొన్ని పాజిటీవ్ రివ్యూస్ రాగా.. మరికొన్ని నెగెటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. కువైట్ లో సినిమా చూసిన కొంత మంది ఆడియన్స్ మాత్రం సల్మాన్ ఖాన్.. సర్ ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ అందించాడని పొగడటం స్టార్ట్ చేశారు.  సినిమా చూస్తుంటే మజా వస్తుందంటూ.. తప్పకుండా చూడాలని కామెంట్లు పెడుతున్నారు. 

38

ఇక కొంత మంది మాత్రం ఒక్కటే పదంలో చెప్పేస్తున్నారు.. కంప్లీట్ గా  డిస్సపాయింట్ చేసింది సినిమా అనేస్తున్నారు.  మరి సల్మాన్ సినిమాలో  సౌత్ వాసనలను తట్టుకోలేకపోతున్నారంటూ.. విమర్షలు కూడా వస్తున్నాయి. 

48

ఇక చాలామంది సల్మాన్ ఖాన్ ఎంట్రీ,..యాక్షన్ సీక్వెన్స్ లు.. మెట్రోట్విస్ట్ లాంటిది అదరగొట్టారంటూ ట్వీట్ చేస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. నెగెటీవ్ టాక్ నమ్మొద్దంటూ.. మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ఈమూవీ కనుల విందు చేస్తుందంటున్నారు. 
 

58
Image: Yentamma the song still / YouTube

ఇక ఈసినిమాపై పాజిటీవ్ గా రియాక్ట్ అవ్వడానికి ఏమీ లేదంటూ.. కొన్ని నెగెటీవ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి ట్విట్టర్ లో. పాజిటీవ్ గా ఏ విషయంలో రియాక్ట్ అవ్వాలి.. సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ విషయం  లేదు అంటూ.. ట్వీట్ చేస్తున్నారు. 

68

ఈ మధ్యలో కాస్త మద్యస్థంగా రివ్యూ ఇచ్చినవారు కూడా ఉన్నారు.ఫస్ట్ హాఫ్ పర్వలేదు.. సెకండ్ హాఫ్ సినిమా ఆవరేజ్ గా ఉంది..  కాసి సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే పెర్ఫామెన్స్ మాత్రం అదరగొట్టారంటున్నారు. ఓవర్ ఆల్ గా సినిమా డిస్సపాయింట్ చేసిదంటూ.. ట్వీట్ చేస్తున్నారు జనాలు. 
 

78
Image: Kisi Ka Bhai Kisi Ki Jaan official Trailer / YouTube

ఇక నెగెటీవ్ రివ్యూస్ పై సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నెగెటీవ్ రివ్వూస్ ను పోస్ట్ చేసినవారంతా..ఫేక్ రివ్యూన్ స్ప్రెడ్ చేస్తున్నారని. సినిమాపై విషం చిమ్ముతున్నారంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి చూసిన తరువాత.. ఎలా ఉందో ఫిక్స్ అవ్వాలంటూ.. ట్విట్టర్ లో సలహాలు ఇస్తున్నారు. ఫేక్ రివ్యూస్  అంటూ.. ట్విట్టర్ లో రీ ట్వీట్ చేస్తూ... రిక్వెస్ట్ చేస్తున్నారు. 

88

మొత్తానికి బాలీవుడ్ కు బంగారం లాంటిసినిమాను ఇవ్వాలి అనుకున్నాడు సల్మాన్ ఖాన్. సోషల్ మీడియాలో ప్రచారం ఎలా ఉన్నా.. సినిమా నచ్చితే మాత్రం.. ఈరోజుల్లో మౌత్ టాక్ ను మించిన పబ్లిసిటీ ఏదీ లేదు. సోషల్ మీడియా ప్రచారం నమ్మి ముందుగా సినిమాకు వెళ్ళకపోయినా.. చిన్నగా పికప్అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. మరి సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ  కి జాన్ సినిమా పరిస్థితి ఏంటీ అనేది రిలీజ్ తరువాత తేలనుంది. 

click me!

Recommended Stories