Intinti Gruhalakshmi: భర్తకు గుడ్ న్యూస్ చెప్పిన దివ్య.. కంగారులో లాస్య?

First Published May 27, 2023, 11:20 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అవమానాల పాలు చేయాలని చూస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో న్యాయం మన వైపు ఉన్నా తలదించుకోవాల్సి వస్తుంది. అన్యాయం లాస్య వైపు ఉన్న మనల్ని ఒక ఆట ఆడిస్తుందని అంటాడు మాధవి భర్త. అనవసరంగా మీరందరూ ఓడిపోయే యుద్ధాన్ని చేస్తున్నారు. నేను జైలుకు వెళ్లడానికి ఎప్పుడో సిద్ధం అంతేగాని లాస్యతో కలిసి జీవించేది లేదు అంటాడు నందు.

ఎందుకు అలా ఆశలు వదిలేసుకుంటావు కోర్టులో నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం లేదు కానీ మాకు నమ్మకం ఉంది అంటారు పరంధామయ్య దంపతులు. లాస్యని కలిసి కాంప్రమైజ్ అవ్వడం మంచిది అంటుంది తులసి. ఇన్నాళ్లు మారనిది ఇప్పుడు మారుతుందా అంటాడు నందు. ఏం మీరు మారలేదా.. తప్పు తెలుసుకోలేదా అలాగే తను కూడా తెలుసుకుంటుంది.
 

లాస్య వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు మీ ప్రతి కష్టంలోని తోడుంటాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరోవైపు భోజనం ముందు కూర్చుని కన్నీరు పెట్టుకుంటాడు విక్రమ్. ఎందుకు అలా బాధపడతారు హాస్పిటల్లో చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మీ అమ్మగారు ఒక్కరికే ఈ సమస్య రాలేదు అంటుంది దివ్య.
 

అందరూ వేరు మా అమ్మ వేరు. మా అమ్మని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అంటాడు విక్రమ్. మీ నాన్న గురించి ఒక్కసారి అయినా ఇలా ఆలోచించావా నా కొడుకు విషయంలో నేను ఎలా గుండె ధైర్యంతో ఉన్నానో  నువ్వు కూడా అలాగే గుండె ధైర్యంతో ఉండు అంటాడు విక్రమ్ తాతయ్య. మా అమ్మని ఎవరితోని పోల్చద్దు తాతయ్య.. మా అమ్మ నాకు ప్రత్యేకం అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్.
 

ఏంటి తాతయ్య ఇది అంటుంది దివ్య. అది వాళ్ళ అటాచ్మెంట్ దానిని తప్పు పట్టలేము అంటుంది ప్రియ. అందుకేనమ్మ నేను వాళ్ళ అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడను. వీడి పిచ్చిప్రేమని వాడుకుంటుంది ఆ రాక్షసి అంటాడు తాతయ్య. కానీ నేను చూస్తూ ఊరుకోను అని కోపంగా అంటుంది దివ్య. మరోవైపు నందు తను చేసిన తప్పులకి గిల్టీగా ఫీల్ అవుతూ తన ఫోటో మీద తానే కాఫీ పోస్తాడు.
 

ఆ శబ్దానికి తల్లిదండ్రులు, తులసి ఆ గదిలోకి వస్తారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ బాధపడతారు పరంధామయ్య దంపతులు. నేను చేసిన తప్పులు గుర్తొస్తే నాకే సిగ్గుగా అనిపిస్తుంది నేను జైలుకు వెళ్ళటం ఖాయం కానీ మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ వయసులో మీకు అండగా ఉండవలసింది పోయి ఒంటరిగా వదిలేస్తున్నాను అని బాధపడతాడు. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోమని తులసిని రిక్వెస్ట్ చేస్తాడు. నా జీవితం ముగిసిపోయింది అని బాధపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు నందు. వాడి బాధ చూడలేకపోతున్నాము వాడికి ధైర్యం చెప్పగలిగింది నువ్వు ఒక్కదానివే అంటూ తులసిని బ్రతిమాలతారు అత్తమామలు. 

ఒంటరిగా ఉన్నప్పుడు కాఫీ తీసుకువెళ్లి ఇస్తుంది. నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాను అంటాడు నందు. పాతికేళ్ల కిందట ఇలా ఆలోచించి ఉంటే మనకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు అంటుంది తులసి. జైలుకి వెళ్ళటానికి సిద్ధపడే ఉన్నారు కదా అయినా ఎందుకు ఇంత ఆవేశం. నా భర్త నన్ను అంతకన్నా ఎక్కువగానే ఇబ్బంది పెట్టారు నేను మౌనంగా భరించాను. జీవితానికి ముగింపు చావు మాత్రమే మిగిలినవన్నీ తాత్కాలికమే. మన సంతోషాన్ని మాత్రమే ఇతరులకు పంచాలి దుఃఖాన్ని మనమే భరించాలి అని నందు కి నచ్చ చెప్తుంది తులసి. మరోవైపు అందరూ హాల్లోకి రండి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అంటుంది దివ్య.

మా అక్క కాలు విరిగిపోతే గుడ్ న్యూసా అంటూ నిష్టూరంగా మాట్లాడతాడు బసవయ్య. ముందు నేను చెప్పేది వింటే అది గుడ్డో, బ్యాడ్డో మీకే తెలుస్తుంది. నేను అత్తయ్య గారి స్కానింగ్ చూశాను ఆవిడ కాలు విరగలేదు కేవలం బెణికింది. రేపటికల్లా ఆవిడ నడిచేలాగా చేస్తాను అంటుంది దివ్య. అదెలా సాధ్యం అంటూ నీళ్లు నములుతాడు బసవయ్య. మీరు పశువుల డాక్టర్ కదా మీరే చూడండి అంటూ రిపోర్ట్స్ అతను చేతిలో పెడుతుంది దివ్య. తప్పదన్నట్లు నిజమే బెణికింది అంటూ నిజం ఒప్పుకుంటాడు బసవయ్య. అవునా అంటూ ఆనందంతో అందరి ముందు భార్యని హత్తుకుంటాడు విక్రమ్. మరోవైపు నందుని అన్ పాపులర్ చేయడం కోసం ఒక వ్యక్తితో డీల్ కుదుర్చుకుంటుంది లాస్య.

మరొకసారి ఆలోచించు ఇంత పంతం అవసరమా అంటుంది భాగ్యం. నన్ను అతను భార్య కాదు అనుకుంటున్నప్పుడు నేను మాత్రం అతని గురించి ఎందుకు ఆలోచించాలి అంటుంది లాస్య. తరువాయి భాగంలో తన ఫోన్లో ఉన్న వీడియో కనిపించకపోవడంతో కంగారుపడుతుంది లాస్య. నీ వీడియో కాకి ఎత్తుకుపోయింది ఇక నీ కథ కంచికి చేరినట్లే అంటుంది  తులసి. ఇక కోర్టులో తన ఫోన్ ఇచ్చి వీడియో చూడమంటుంది లాస్య. కంగారుపడుతుంది తులసి.

click me!