దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ మొదలయింది. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానుల కేరింతలతో థియేటర్స్ మోతెక్కుతున్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతమైన నటన అందించారు. రాజమౌళి మరోసారి వెండితెరపై తన మార్క్ ప్రదర్శించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.