మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తోన్న మూవీకి `వారణాసి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీపై మరింత అంచనాలు పెంచారు విజయేంద్రప్రసాద్. గూస్ బంమ్స్ తెప్పించారు.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబ్ ట్రోటర్ మూవీకి టైటిల్ కన్ఫమ్ చేశారు. `వారణాసి` అనేపేరు పెట్టారు. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్న ఈవెంట్‌లో ఈ టైటిల్ గ్లింప్స్ ని రివీల్ చేశారు. ఇందులో త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై సవారీ చేస్తూ ఉన్న మహేష్ లుక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అదే సమయంలో `వారణాసి` టైటిల్‌ని కూడా ప్రకటించారు. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ టైటిల్‌ని కన్ఫమ్ చేశారు. సినిమాలోని లుక్‌తోనే ఈవెంట్‌కి మహేష్ బాబు రావడం విశేషం.
24
మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్
ఇక ఈ ఈవెంట్లో `వారణాసి` కథ రాసిన దిగ్గజ రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు కథలు రాశామని, కానీ ఇదొక గొప్ప ఫీలింగ్ అన్నారు విజయేంద్రప్రసాద్. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అదే సమయంలో హిమాలయాలకు వెల్లడం అదొక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పొచ్చు. కానీ దాన్ని మించిన మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్ ని ఈ మూవీ ఇచ్చిందన్నారు విజయేంద్రప్రసాద్.
34
30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మహేష్ విశ్వరూపం చూస్తారు
ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇందులో ముప్పై నిమిషాలపాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందన్నారు. అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేలా ఉంటుందని వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందనేలా ఆయన వెల్లడించారు. ఇందులో మహేష్ బాబు విశ్వరూపం చూస్తారని, అద్భుతంగా చేశాడని వెల్లడించారు. ఆయా సీన్లని ఆర్‌ఆర్ లేకుండా, డబ్బింగ్ లేకుండా, వీఎఫ్‌ఎక్స్ లేకుండా, ఎలాంటి సౌండ్స్ లేకుండా రా కంటెంట్‌ని చూశానని, అది చూస్తేనే ఆ ఫీలింగ్ కలిగిందని, కానీ తెరపై చూస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు, నేను పొందిన ఫీలింగ్‌ని మీరు పొందుతారని తెలిపారు విజయేంద్రప్రసాద్.
కొన్ని సినిమాలు మనుషులు తీస్తారు, కానీ కొన్ని సినిమాలను దేవతలే చేయించుకుంటారు. అలా చేయించుకున్నదే ఈ మూవీ అని, మహేష్ బాబుపై ఒక హనుమా ఉన్నారు. ఆయన ముందుండి నడిపించారు. ఆయన ఆశీస్సులతోనే ఈ మూవీ చేయగలుగుతున్నట్టుగా తెలిపారు విజయేంద్రప్రసాద్. మొత్తంగా సినిమాపై భారీ హైప్ ఇచ్చారు రైటర్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషించారు. కేఎల్ నారాయణ నిర్మించారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.