రామ్ చరణ్, ఉపాసనలు ట్విన్స్ కి జన్మనిచ్చారు. శనివారం అర్థరాత్రి ఉపాసన డెలివరీ అయ్యింది. ఒక కుమారుడు, కూతురు జన్మించారు. కుమారుడు మొదట, ఆ తర్వాత కూతురు జన్మించిందట. చిరంజీవి, సురేఖల సంతానం మాదిరిగానే చరణ్, ఉపాసనలకు కూడా మొదట కూతురు, తర్వాత కుమారుడు, ఆ తర్వాత కూతురు జన్మించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో పలు రూమర్స్, కొన్ని విమర్శలు వచ్చాయి. సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారనే వార్తలు చాలా రోజులుగా వినిపించాయి.