VD12: విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

Published : Jan 20, 2025, 05:51 PM IST

విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 సినిమా మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడి మే 30, 2025న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావచ్చని, విజయ్ దేవరకొండ స్పై పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

PREV
15
VD12: విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?
vijay devarakonda movie VD12 in Cinemas Worldwide from 28th March 2025


 విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. అయితే రిలీజ్ విషయమై క్లారిటీ లేదు. మరో ప్రక్క విజయ్‌ కొత్త చిత్ర సన్నాహాలు ఊపందుకున్నాయి. ఆయన రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్  పనుల్లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. ఈ క్రమంలో VD12 రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అయితే అఫిషియల్ గా కన్ఫర్మేషన్ అయితే లేదు.
 

25


విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూట్‌ ఆ మధ్యన  కేరళలో జరిగింది. విజయ్‌ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ను నవంబరు కల్లా పూర్తి చేయాలని విజయ్‌ దేవరకొండ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుని మరీ పూర్తి చేసారు. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. 
 

35


‘వీడీ 12’ సినిమాని మార్చి 28 న రిలీజ్ చేయాలని మొదట ఫిక్స్ చేసారు.  అయితే రకరకాల కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం మే 30, 2025 న ఈ చిత్రం రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇంటెన్స్ డ్రామా గా రూపొందే ఈ సినిమాలో ఎన్నో ఎలిమెంట్స్ కీలకమై సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్‌పైత్వరలో  ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్పెగా కనిపిస్తారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే చాన్స్‌ ఉందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.  
 

45


రాహుల్‌ సంకృత్యాన్, రవి కిరణ్‌ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్‌ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాల షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాల్లోని క్యారెక్టర్స్‌ కోసం విజయ్‌ మేకోవర్‌ కావాల్సి ఉంది. అందుకే ‘వీడీ 12’ సినిమా చిత్రీకరణను తొందరగా పూర్తి చేసేసారు. రెస్ట్ తీసుకుని, తన తర్వాతి సినిమాలపై ఫోకస్‌ పెట్టాలని విజయ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
 

55


అంతేకాదు దీని కోసం విజయ్‌ గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. 1854-78 మధ్య రాయలసీమ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. దీంట్లో విజయ్‌ దేవరకొండ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక (rashmika) హీరోయిన్ గా కనిపించే అవకాశముంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
 

click me!

Recommended Stories