వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా.? వామ్మో ఐశ్వర్య కుటుంబంలో ఇన్ని విషాదాలా..

Published : Jan 20, 2025, 05:07 PM IST

సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే తారలకు సంబంధించి ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా.? వామ్మో ఐశ్వర్య కుటుంబంలో ఇన్ని విషాదాలా..

శ్రీలక్ష్మి.. ఈ పేరు చాలా మందికి తెలియకపోయిన్పటికీ 'జయంబు నిశ్చయంబు' మూవీలోని 'బాబూ చిట్టీ' అనే డైలాగ్‌ చెప్పగానే కళ్ల ముందు ఓ రూపం కనిపిస్తుంది. బాబూ చిట్టీ అనే డైలాగ్‌లో చాలా పాపులర్‌ అయ్యారు శ్రీలక్ష్మి. తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ సీనియర్‌ నటి. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా తమిళ మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన శ్రీలక్ష్మికి ఎన్నో అవార్డులు వరించాయి.
 

25

రెండు జళ్ల సీత మూవీకి అమెకు ఉత్తమ నటిగా కళాసాగర్‌ అవార్డు వరించింది. అయితే శ్రీలక్ష్మికి, నటి ఐశ్వర్య రాజేష్‌కు బంధుత్వం ఉందని మీకు తెలుసా.? శ్రీలక్ష్మి స్వయాన తమ్ముడు కూతురే ఐశ్వర్య రాజేష్‌. శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్‌ కూడా ఒకప్పుడు నటుడిగా రాణించాడు. జంధ్యాల దర్శకత్వం వహించిన `నెలవంక` మూవీలో రాజేష్‌ హీరోగా నటించారు. `రెండు జళ్ల సీత`, `ఆనంద భైరవి` వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజేష్‌ మరణించారు. 
 

35

కుటుంబానికి నచ్చని వివాహం చేసుకున్నరాజేష్‌ ఆ తర్వాత మద్యానికి బనిసయ్యారు. అప్పటికే రాజేష్‌కు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో 38 ఏళ్ల వయసులో రాజేష్‌ మరణించారు. రాజేష్‌ మరణించిన సమయంలో ఐశ్వర్య వయసు 8 ఏళ్లు. ఇదిలా ఉంటే ఐశ్వర్య కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. రాజేష్‌ మరణం తర్వాత ఇద్దరు కుమారులు కూడా మరణించారు. 
 

45

ఈ విషయాలను శ్రీలక్ష్మి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజేష్‌కు నలుగురు పిల్లలు పుట్టారు. పెళ్లి విషయంలో తలెత్తిన కారణంతోనే రాజేష్‌ మద్యానికి అలవాటు పడ్డారని శ్రీలక్ష్మి తెలిపింది. నలుగురిలో ముగ్గురు మగవారు కాగా ఐశ్వర్య ఒక్కతే అమ్మాయి. అయితే ఇద్దరు మగవారు మరణించారని ఆమె చెప్పుకొచ్చింది.

ఇద్దరిలో ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రేమ విషయంలో తలెత్తిన సమస్యలతో సూసైడ్ చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. కాగా రెండో అబ్బాయి కారులో 140 కి.మీ వేగంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కూడా కేవలం 20 ఏళ్లలోనే మరణించడం వారి కుటుంబంలో నెలకొన్న విషాదం. 
 

55

ఇక ప్రస్తుతం ఐశ్వర్యతో పాటు మరో అబ్బాయి ఉన్నాడు. ఐశ్వర్య రాజేష్‌ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 1995లో రాంబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార తాజాగా పలు విజయాలను సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో రెండు చిత్రాలు, కన్నడలో ఒక సినిమాలో నటిస్తోంది. 

click me!

Recommended Stories