తన ప్రియుడు విజయ్ వర్మ కోసం తన 18 ఏళ్ళ నో కిస్ రూల్ ను బ్రేక్ చేసిందంట స్టార్ సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా. ఇంతకీ ఆమె ఎందుకు అలా చేసింది. అయితే ఈ విషయంలో విజయ్ వర్మ స్పందన ఏంటీ.. ఆయన ఏమంటున్నాడంటే..?
రియల్ లైఫ్ ప్రేమ జంట తమన్నా-విజయ్ వర్మ రీల్ లైఫ్ లో నటించిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 2' ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు కు సబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తోంది. అంతే కాదు ఈ వెబ్ మూవీలో కూడా.. తమన్నా, విజయ్ హాట్ హాట్ సీన్స్ తో అదరగొట్టారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఈనెల 29 నుంచి నెట్లెక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
26
ఇక స్ట్రీమింగ్ డేట్ దగ్గరలో ఉండటంతో మూవీ టీమ్ ప్రచారాన్ని గట్టిగా షురు చేసింది. వరుస ఇంటర్వ్యలతో సందడి చేస్తున్నారు టీమ్. ఈ క్రమంలో తాజాగా విజయ్ వర్మ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు తమన్న తన కోసం బ్రేక్ చేసిన రూల్ గురించి కూడా కామెంట్స్ చేశారు విజయ్ వర్మ. తమన్నాతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
36
Photo Courtesy: Instagram
ఈమధ్య తమన్నా భాటియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఆసక్తి కర కామెంట్లు చేసింది. వాటిపై కూడా విజయ్ స్పందించారు. ఆమె లస్ట్ స్టోరీస్ 2లో తన సెగ్మెంట్ కోసం తన 18 ఏళ్ల నో-కిస్ పాలసీని బ్రేక్ చేసినట్లు వెల్లడించింది. అంటే ఆస్ స్క్రీన్ కిస్ ఇప్పటి వరకూ ఎవరికి ఇవ్వలేదని.. కాని విజయ్ కోసం ఆ రూల్ ను బ్రేక్ చేసినట్టు వెల్లడించింది.
46
ఇక ఈ విషయంలో విజయ్ కూడా స్పందించారు. లస్ట్ స్టోరీస్ లో ఈ పాత్రకు తమన్నా మాత్రమే సరిపోతుందని.. ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. ముందుగా స్క్రిప్ట్ చదవగానే హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడిగాను. తమన్నా అని చెప్పగానే మంచి సెలక్షన్ అని అనేశాను. ఎందుకంటే నిజానికి ఆ పాత్రకు ఆమె కరెక్ట్ గా సరిపోయింది. అంతే కాదు ఆ పాత్రకు ఆమె మరింత గ్లామర్ను తెచ్చింది. తను నటించే పాత్రలో ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తుంది. చాలా శ్రద్ధగా పని చేస్తుంది. ఆమె మాత్రమేఅలా చేయగలదు అని విజయ్ అన్నారు.
56
vijay varma
అంతే కాదు తోటి నటులు ఉత్సాహంగా పని చేసినప్పుడే షూటింగ్ సరదాగా ఉంటుంది. తమన్నా ఎనర్జీ షూటింగ్ సెట్ అంతా హుషారుగా ఉండేట్టు చేస్తుంది. అందుకే తమన్నా ఓ ఐకాన్. నేను తమన్నా నటించిన 'బాహుబలి'ని థియేటర్లో చూశా.. తాజాగా ఆమె నటించిన 'బబ్లీ బౌన్సర్ను చూశాను వాటిల్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. లస్ట్ స్టోరీస్-2 చూశాక ఆడియన్స్ కూడా అదే అభిప్రాయం వ్యాక్తం చేస్తారు అని విజయ్ అన్నారు. ప్రస్తుతం విజయ్ కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
66
అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లోనే తమన్నా, విజయ్ మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ల తమన్నా వెల్లడించింది. సమయం వచ్చినప్పుడు వీళ్ల ప్రేమకు సంబంధించిన విషయాలు చెబుతానని విజయ్ వర్మ చెప్పుకోచ్చారు. ఇక విజయ్ వర్మ బాలీవుడ్ లో బిజీగా ఉండగా.. తమన్నా ఇటు సౌత్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ.. బిజీ గా ఉంది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'భోళా శంకర్'లో నటిస్తోంది. అలాగే రజనీకాంత్ జైలర్లో కనిపించనుంది. ఇటీవలే దీని షూటింగ్
పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది.