'వారసుడు' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. కథ కొత్తగా ఏమీ లేదు కానీ.. సినిమా హిట్టా ? ఫట్టా ?

First Published Jan 8, 2023, 5:51 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి చిత్రాలతో పాటు దిల్ రాజు తన వారసుడు చిత్రాన్ని కూడా సంక్రాంతికి దించుతున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి చిత్రాలతో పాటు దిల్ రాజు తన వారసుడు చిత్రాన్ని కూడా సంక్రాంతికి దించుతున్నారు. అయితే ఈ చిత్రం తెలుగులో సంక్రాంతికి వస్తుందా రాదా అనే సందిగ్దత కొనసాగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం వారసుడు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. 

తాజాగా వివాదాస్పద క్రిటిక్ ఉమర్ సంధు విజయ్ వారసుడు చిత్రానికి రివ్యూ ప్రకటించాడు. ఓవర్సీస్ సెన్సార్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు వీక్షించానని పేర్కొన్నాడు. ఉమర్ సందు ఈ చిత్రానికి ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్, రష్మిక మందన జంటగా నటించారు. 

ఉమర్ సంధు తన సోషల్ మీడియాలో.. ఈ చిత్రంలో విజయ్ తన డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, నటనలో తన బెస్ట్ అందించాడు. విజయ్ నుంచి ఇలాంటి ఎంటర్టైనింగ్ పెర్ఫామెన్స్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఏమీ అనిపించదు. 

కానీ ప్రతి సన్నివేశం ఎంగేజింగ్ గా ఉండేలా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. మాస్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. రష్మిక మరోసారి తన అందంతో అందరిని మైమరపించింది. ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అంటే సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. విజువల్స్ ఐఫీస్ట్ లాగా ఉంటాయి. 

కథలో చాలా లేయర్స్ ఉంటాయి. కానీ అన్నీ గత చిత్రాల్లో చూసినవే. తండ్రి కొడుకు సెంటిమెంట్.. తల్లి కొడుకు సెంటిమెంట్ గత చిత్రాల్లో లాగానే ఉంటుంది. అయితే క్లైమాక్స్ మాత్రం అమేజింగ్. ఫస్ట్ హాఫ్ లెన్త్ తగ్గించి ఉంటే బావుండేది. ఓవరాల్ గా వారసుడు చిత్రం పైసా వసూల్ మూవీ.. 3.5 రేటింగ్ అంటూ ఉమర్ సంధు పోస్ట్ పెట్టారు. 

తమిళనాట విజయ్ చిత్రాలకు యావరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ అదిరిపోతాయి. అలాంటిది పండగ సీజన్ లో రిలీజైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి రెండు భారీ చిత్రాల నడుమ దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా లేదా వేచి చూడాలి. 

click me!